నేటి యువకులు వీర్యకణాల తగ్గుదలను ఎదర్కొంటున్నారు. కారణాలు అందరికి తెలిసినవే, కొంతమందికి తెలియనివి కూడాను. తక్కువ వీర్యకణాలు కలిగి వుండటానికి కారణాలు అనేకం వుంటాయి. అన్నిటికి ఒకే మూలం జీవన శైలి మారటం. పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గితే సంతానోత్పత్తి తగ్గి చివరకు మానవ జాతి అంతరించే సమస్య కూడా ఏర్పడగలదు. వీర్యకణాలు తగ్గటానికి కారణాలు, వాటికి పరిష్కారాలు పరిశీలిద్దాం. మొబైల్ ఫోన్లు – యువకుల్లో వీర్యకణాలు తగ్గటానికి మొబైల్ ఫోన్లు కారణమంటూ మీడియా కోడై కూస్తోంది.
యువకులు తమ హైటెక్ ఫోన్లను పెట్టరాని చోటైన పేంటు జేబులో పెట్టుకొని యధేచ్ఛగా తిరగడం చూస్తున్నాం. వాటి రేడియేషన్ ప్రభావాలతో సిగ్నల్ వస్తే చాలు వీర్యకణాలు చచ్చిపోతున్నాయి. పరిష్కారం….ఒక మంచి లెదర్ పోచ్ పెట్టండి లేదా మీ బ్యాగ్ లో పెట్టుకోండి. శరీరాన్ని నష్టపరచేంతగా టెక్నాలజీని ప్రేమించకండి. పొగతాగుడు – 16 సంవత్సరాల వయసులో పొగతాగటం మొదలు పెట్టి ఇప్పటికి వయసు 30 సంవత్సరాలయిందంటే….వీర్య కణాలకు నష్టం వాటిల్లినట్లే. మీ ప్రాణానికి భయపడి సిగరెట్ మానకపోయినా, కనీసం నపుంసకుడైపోతానన్న భయంతో అయినా సిగరెట్ మానేయండి.
బాడీ హీట్ – వీర్యకణాలు వృషణాలలో వుంటాయి. అవి జీవంతో వుండాలంటే చల్లని ప్రదేశం వుండాలి. మీ శరీర వేడి ఏ కారణం చేత పెరిగినా వీర్య కణాలు తగ్గినట్లే. పరిష్కారంగా…ప్రతిరోజూ తల స్నానం, మజ్జిగ, చల్లటి జ్యూసులు తాగాలి. బిగువైన దుస్తులు, అండర్ వేర్లు కూడా వీర్యకణాల సంఖ్య తగ్గిస్తాయి. సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి. మోటర్ బైక్ లపై కూర్చొని దూర ప్రయాణాలు చేస్తే మెషీన్ వేడికి మీ వీర్యకణాలు తగ్గి సమస్య అవుతుంది. కనుక దూరప్రయాణంలో మధ్యలో బైక్ నుండి దిగి విశ్రాంతి పొందాలి. ఒత్తిడి – ఈ రోజుల్లో అన్నిటికంటే ప్రధానమైనది ఒత్తిడి. స్మోకింగ్, లేదా మొబైల్ ఫోన్ లో టెన్షన్ గా మాట్లాడేయటం అన్నీ ఒత్తిడే. పరిష్కారం…ధ్యానం చేసి రిలాక్స్ అవండి. పై చిట్కాలు పాటిస్తే, మీ వీర్యంలో కణాల సంఖ్య సాధారణంగా వుండి సమస్యలు లేకుండా వుంటుంది.