వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

రోజూ ఉదయాన్నే అల్పాహారం చేయడం అందరికీ అలవాటు. కానీ కొందరు బరువు తగ్గాలనో, ఇతర ఆరోగ్య కారణాల పేరిటో టిఫిన్ చేయడం మానేస్తారు. ఒక్కసారిగా టిఫిన్‌ తినడానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అయితే ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని, అల్పాహారమే క‌దా అనుకుంటే అంతులేని సమస్యలా మారే ప్రమాదాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికీ అల్పాహారం చాలా ముఖ్యమని, ఇది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకంగా ఉంటుందని కూడా చెప్తున్నారు.అల్పాహారం తీసుకోకపోవడంతో అందరికీ వచ్చే తొలి ఇబ్బంది.. చిరాకు. కడుపులో ఆకలి కేకలు పెడుతుంటే.. తొలుత వచ్చేది చికాకే. న్యూరోట్రాన్స్‌మిటర్ సెరోటోనిన్ మన మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావింతం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మనం అల్పాహారంం తీసుకోవడం మానేయడం వల్ల ఈ సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీని వల్ల చికాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు అధికమవుతాయని వైద్యులు చెప్తున్నారు.

టిఫిన్ తీసుకోకపోవడం వల్ల మన మెటబాలిక్ సిస్టమ్ దెబ్బతింటుంది. దీని వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం అధికమవుతుంది. ఇది గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాల‌ను పెంచుతుంది. రోజూ తీసుకునే అల్పాహారాన్ని ఒక్కసారిగా మానేయడం, అలాగే కొనసాగించడం వల్ల శరీరానికి కావాల్సిన, తరచుగా వచ్చే పోషకాల లోటు ఏర్పడుతుంది. దాంతో పాటుగా మన శరీరంలోని విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు లోపించే ప్రమాదం ఉంది. ఇదొక్కటే అనేక వ్యాధులకు కారణం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్న మాట. అల్పాహారం తీసుకోవడం ఒక్కసారిగా మానేయడం వల్ల గుండె పోటు, రక్తపోటు పెరుగుతాయి. గుండె సంబంధిత అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్‌లు కూడా అధికం అవుతాయి. ఇది తీవ్రస్థాయిలో ఉండే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.

if you are skipping breakfast then know what happens

బరువు తగ్గుదామని టిఫిన్ మానేస్తే బరువు అధికంగా పెరిగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ సమయంలో పెరిగే బరువు అనేక వ్యాధులకు కారణం అవుతుందని చెప్తున్నారు. సాధారణంగానే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మధ్యాహ్న భోజనం అధికంగా తీసుకుంటాం. దాని వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. మన మెటబాలిక్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల బరువు వేగంగా పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మన జీవితంలో దేనినైనా ఒక్కసారిగా మానేయడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని, కాబట్టి అది చెడు అలవాటైనా, మంచి కోసం చేస్తున్న మార్పైనా చిన్నచిన్నగా చేయడం లేదా వైద్యుల సలహా మేరకు చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు.

Admin

Recent Posts