శరీరంలో అధిక బరువు అంటూ చాలామంది డైటింగ్ చేసి పొట్ట ఖాళీగా వుంచి ఆకలిసైతం అనుభవిస్తారు. అయితే, ఇటువంటి వారికొరకై, కడుపునిండా తినేసినా శరీరంలో కొవ్వు పట్టని ఆహారాలు కొన్ని చూడండి. చేపలు – సలమాన్, టునా, మాక్రెల్, హెర్రింగ్, సార్డైన్స్ రకాల చేపలలో పుష్కలమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. ఇవి ఆకలిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్ ను మరింత సమర్ధవంతంగా పనిచేసేలా చేసి శరీరానికి మేలు చేస్తాయి. వీటిలో తగినంత ప్రొటీన్ కూడా వుంటుంది. చేపల వంటకానికి పక్కనే కొన్ని కూరలు పెట్టుకుని తినేస్తే కడుపు నిండిపోతుంది.
నిమ్మ జాతి పండ్లు – ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్, బత్తాయి, బొప్పాస, జామ, టమాటాలలో విటమిన్ సి మరియు కావలసినంత పీచు వుంటుంది. విటమిన్ సి శరీరంలో కొవ్వును వేగంగా ప్రాసెస్ చేసి ఎమినో యాసిడ్ రిలీజ్ చేస్తుంది. వీటిలో చాలినంత నీరుకూడా వుండి 50 నుండి 75 కిలో కేలరీల శక్తినిస్తుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది.
పచ్చని కూరగాయలు – బచ్చలికూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు, బ్రక్కోలి వంటివాటికి ధార్మిక ప్రభావం అధికం. తక్కువ కేలరీలుంటాయి. ఇవి శరీరంలో కొవ్వుగా పేరుకోవు. జీర్ణక్రియలోనే కేలరీలు ఖర్చయిపోతాయి. అంతేకాక, వీటిలోని పీచు పదార్ధం శరీరానికి కావలసినన్ని యాంటీఆక్సిడెంట్లు,విటమిన్లు, మినరల్స్ ఇచ్చి మీ కడుపు పూర్తిగా నిండేలా చేస్తాయి.