వైద్య విజ్ఞానం

Black Marks On Tongue : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..!

Black Marks On Tongue : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో నాలుక కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు రుచిని తెలియ‌జేస్తుంది. దీంతో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల రుచుల‌ను ఆస్వాదిస్తాము. అయితే డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్ల‌గానే మ‌న నాలుక చూపించ‌మంటారు. ఎందుకంటే నాలుక‌ను చూసి మ‌న‌కు వచ్చిన అనారోగ్య స‌మ‌స్య గురించి ఇట్టే చెప్ప‌వచ్చు. అందువ‌ల్లే వైద్యులు ముందుగా నాలుక చూపించ‌మంటారు. అయితే వాస్త‌వానికి నాలుక ఇచ్చే ప‌లు సూచ‌న‌ల‌ను గుర్తించ‌డం ద్వారా మ‌నం కూడా మ‌నకు క‌లిగిన అనారోగ్య స‌మ‌స్య ఏమిటో ముందుగానే తెలుసుకోవ‌చ్చు. ఇక నాలుక‌పై ఎలాంటి సూచ‌న‌లు క‌నిపిస్తే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుక మీద తెల్ల‌గా ఉంటే మీరు జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, షుగ‌ర్ ఉంద‌ని అర్థం. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి లేదా షుగ‌ర్ ఉన్న‌వారికి కూడా నాలుక మీద తెల్ల‌గా ఉంటుంది. ఇలా గ‌న‌క ఉంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి. లేదంటే స‌మ‌స్య‌లు మ‌రింత తీవ్ర‌త‌రం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. ఇక నాలుక మీద న‌ల్ల‌ని మచ్చ‌లు ఉన్నాయంటే వెంట‌నే అల‌ర్ట్ అవ్వాల్సిందే. సాధార‌ణంగా ఇలాంటి మ‌చ్చ‌లు క్యాన్స‌ర్ వ‌ల్ల ఏర్ప‌డుతాయి. లేదంటే ధూమ‌పానం చేయ‌డం వ‌ల్ల ఏర్ప‌డుతాయి. క‌నుక ఇలాంటి మ‌చ్చ‌లు వ‌స్తున్నాయంటే అప్ర‌మ‌త్తంగా ఉండాలి. లేదంటే క్యాన్స‌ర్ బారిన ప‌డ‌తారు.

if you have black spots on tongue then beware

ఇక నోటి స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ నాలుక మీద తెల్ల‌ని పొర ఏర్ప‌డుతుంది. వీరికి నోటి దుర్వాస‌న కూడా ఉంటుంది. శ‌రీరంలో బాక్టీరియా, వైర‌స్‌, ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఉంటే నాలుక పొర‌లుగా అయిన‌ట్లు క‌నిపిస్తుంది. నాలుక వాపుల‌కు కూడా గుర‌వుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డిన వారి నాలుక ప‌సుపు రంగులో లేదా పాలిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇలా నాలుక‌ను చూసి మ‌న‌కు ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తెలుసుకోవ‌చ్చు. ఇవి తెలుసుకుంటే వ్యాధులు మ‌రింత ముద‌ర‌కుండా చూసుకోవ‌చ్చు.

Admin

Recent Posts