బ్లడ్ క్యాన్సర్. ఇది వచ్చిందంటే ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. బ్లడ్ క్యాన్సర్ ముదిరిన వారు బతకడం చాలా కష్టం. అయితే దీన్ని ఆరంభంలో గుర్తిస్తే కొంత వరకు బతికేందుకు చాన్స్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అసలు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..? కొన్ని లక్షణాలు ముందే శరీరంలో కనిపిస్తాయి. వాటిని కనిపెట్టడం ద్వారా బ్లడ్ క్యాన్సర్ వచ్చిందా, రాలేదా అన్నది నిర్దారించుకోవచ్చు. దీంతో తగిన సమయంలో చికిత్స తీసుకుంటే ప్రాణాల మీదకు రాకుండా ఉంటుంది. అయితే బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పడానికి శరీరంలో ఏయే లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి జ్వరం ఓ సంకేతం. ఎప్పటికీ జ్వరం అలాగే ఉంటే వారు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తెలుసుకోవాలి. ఈ దశలో వైరస్‌లపై శరీర రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా పనిచేస్తుంది. కనుక పెద్ద మొత్తంలో కణాలు నాశనం అవుతాయి.
నోరు, ముక్కు, గుదము, గర్భాశయం వంటి భాగాల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇది బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పడానికి మరో సంకేతం. రక్తంలో ఉండే ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. ఈ సమయంలో చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలు విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి. ఫలితంగా చర్మం రంగు మారుతుంది. కొన్ని చోట్ల ఎరుపు లేదా వేరే ఇతర రంగుల్లో మచ్చలు, దద్దుర్లు కనిపిస్తాయి. ఇలా అవుతూ ఉన్నా బ్లడ్ క్యాన్సర్‌గా అనుమానించాలి. చల్లని వాతావరం ఉన్నప్పటికీ విపరీతమైన చెమటలు (శరీరం తడిసి పోయే విధంగా) పడుతూ ఉంటే బ్లడ్ క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను తీసుకెళ్తూ ఉంటుంది. దీంతో మన శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే బ్లడ్ క్యాన్సర్ వస్తే ఎర్ర రక్త కణాలు నశిస్తుంటాయి కనుక ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగక శక్తి అందదు. దీంతో ఎప్పుడూ తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. ఇలా ఉన్నా బ్లడ్ క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే. రక్తస్రావం, బ్లడ్ క్లాట్ అవుతూ ఉండడం వల్ల ఛాతిలో నొప్పి వస్తుంటుంది. కాళ్లు వాపులకు గురవుతుంటాయి. ఈ లక్షణాలు ఉంటే బ్లడ్ క్యాన్సర్‌గా గుర్తించాల్సి ఉంటుంది. క్యాన్సర్ వల్ల శరీరంలో చేరే వైరస్‌ను నాశనం చేసేందుకు తెల్ల రక్త కణాలు తీవ్రంగా శ్రమిస్తాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున తెల్ల రక్త కణాలు నశిస్తాయి. తిరిగి ఏర్పడేందుకు కూడా అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కనుక శరీరంలో ఎప్పటికప్పుడు ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ లక్షణాలు గనక ఉంటే ఎవరైనా అశ్రద్ధ చేయకండి. అది బ్లడ్ క్యాన్సర్ అయి ఉండవచ్చు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచిది.