Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. కొద్ది క్ష‌ణాల్లో మీకు హార్ట్ ఎటాక్ రాబోతుంద‌ని అర్థం..

Admin by Admin
June 26, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా మన శరీరం ముందే గుర్తించి, దాని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు గుండె జబ్బులు, స్ట్రోక్‌ల బారిన పడుతున్నారు. ఇందుకు నిశ్చలమైన జీవనశైలి, జన్యు లోపాలు కారణం కావొచ్చు. కొన్నిసార్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే మహిళలు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత దీనికి ప్రధాన కారణమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో కనిపించే సంకేతాల (Pre-heart Attack Symptoms) గురించి నిపుణులు తెలియజేశారు. మీరు ఇలాంటి లక్షణాలను గమనిస్తే, వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

డాక్టర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ, గుండెకు రక్తం సరిగ్గా ప్రవహించలేనప్పుడు, చేతిలో బలహీనత మొదలవుతుంది. అప్పుడు చేతులు, కాళ్ళలో తిమ్మిరి, గందరగోళం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. తరచుగా ఈ లక్షణాలన్నీ శరీరానికి ఒక వైపున సంభవిస్తాయి. కానీ దీని ప్రభావం శరీరం అంతటా ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగడం కూడా జరగవచ్చు. వాంతులు అవుతున్నట్లు కూడా అనిపించవచ్చు. మీరు ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే, డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేయవద్దు. కొన్నిసార్లు మీరు చెప్పాలనుకున్న మాటను చెప్పలేరు. పదాలు అస్పష్టంగా వస్తాయి. మాట్లాడటానికి కంఠం పెగలదు, తక్కువ స్వరంలో మాట్లాడతారు. కొన్నిసార్లు అసలే మాట్లాడలేకపోవచ్చు. ఇవి స్ట్రోక్‌కి సంబంధించిన సంకేతాలు కావచ్చు. మీరు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి.

if you have these signs you will get heart attack very soon

మీరు అకస్మాత్తుగా గందరగోళానికి గురైతే, మీరు ఎక్కడ ఉన్నారు,మీ చుట్టూ ఏమి జరుగుతోందో అర్థం కానీ అయోమయ పరిస్థితి ఉంటే జాగ్రత్త. ఇలాంటి సందర్భంలో మీకు మైకంగా, అసౌకర్యంగా అనిపించడం ప్రారంభమవుతుంది. మీరు నీరసంగా ఉంటారు. మత్తులో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ మీరు ఆల్కహాల్ తాగకపోయినా, మత్తులో లేకపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. అమెరికన్ హార్ట్ హెల్త్ అసోసియేషన్ ప్రకారం, దీర్ఘకాలిక మైగ్రేన్లు స్ట్రోక్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతాయి. మీరు ఎప్పుడైనా అకస్మాత్తుగా భరించలేని తలనొప్పిని అనుభవించవచ్చు. ఇది మీకు తరచుగా జరిగితే, మీరు వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి.

మీకు దాదాపు 30 సెకన్ల పాటు ఎక్కిళ్ళు ఉంటే, అది సాధారణనదే, భయమేం లేదు. జర్నల్ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరోఫిజియాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఆగకుండా నిరంతరం ఎక్కిళ్ళు వస్తుంటే, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కిళ్లు తగ్గకపోతే, అది స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. కాబట్టి ఎక్కిళ్లను నిర్లక్ష్యం చేయకండి.

Tags: heart attack
Previous Post

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ప్పుడు ఒంట‌రిగా ఉంటే ఏం చేయాలి..? క‌చ్చితంగా షేర్ చేయాల్సిన విష‌యం..!

Next Post

రోజంతా ఉత్తేజంగా ఉండాలంటే ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేస్తే చాలు..!

Related Posts

ఆధ్యాత్మికం

ఆల‌యంలో ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న‌ప్పుడు ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..!

July 9, 2025
lifestyle

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

July 9, 2025
ఆధ్యాత్మికం

ఉల్లి, వెల్లుల్లిని బ్రాహ్మణులు ఎందుకు తిన‌రు..?

July 9, 2025
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

July 9, 2025
lifestyle

ఆకుకూర‌లు లేదా కూర‌గాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..!

July 9, 2025
information

ఇనుము తుప్పు పడుతుంది.. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా?

July 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.