ఆరోగ్యం విషయంలో, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, అనేక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా, ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా, ప్రతి ఒక్కరు కూడా, పనుల్లో మునిగిపోయి ఒత్తిడికి గురవుతున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా, పని చేస్తూ ఒత్తిడితో సతమతమయ్యే వాళ్ళు, చాలామంది ఉన్నారు. జీవన విధానం మారిపోవడం, ఆహారపు అలవాట్లు అలానే, ఆరోగ్యం పై శ్రద్ధ తక్కువవడం మొదలైన కారణాల వలన రక్తపోటు సమస్య, అందరిలో ఎక్కువగా కనబడుతోంది.
ఒకప్పుడు, కనీసం 60 ఏళ్ళు దాటితే, రక్తపోటు వచ్చేది. కానీ, ఇప్పుడు పాతికేళ్ల వాళ్ళకి కూడా రక్తపోటు సమస్య వస్తోంది. ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం, గంటల తరబడి కూర్చుని పని చేయడం, ఒత్తిడి, సరైన శారీరక శ్రమ లేకపోవడం వలన బీపీ బారిన చాలామంది పడుతున్నారు. బీపీ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య, రోజురోజుకీ పెరుగుతోంది. బీపీ వలన హృదయ సంబంధిత సమస్యలు వస్తున్నాయి.
బీపీని గుర్తించి, జీవన విధానంలో మార్పు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలానే, ఆహారం విషయంలో కూడా, కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. రాత్రిపూట, ఈ లక్షణాలు కనపడినట్లైతే, రక్తపోటు సమస్య ఉందని చెప్పొచ్చు. ఛాతి లో నూపి, గుండెనొప్పి కూడా, బీపీ వలన రావచ్చు. ఇవి ప్రధాన లక్షణాలు. అయితే. ఒక్కొక్కసారి ఛాతి నొప్పి మామూలుగా కూడా వస్తుంది. నొప్పి క్రమం తప్పకుండా, ఒకే వైపు వచ్చినట్లయితే బీపీ గా భావించాలి.
వెంటనే బీపీని చెక్ చేయించుకోవాలి. రాత్రి పడుకున్న తర్వాత కూడా, మూత్ర విసర్జన ఎక్కువైతే కూడా, బీపీ సమస్య అని గ్రహించాలి. రక్తనాళాలపై ఒత్తిడి పెరగడం, మూత్రపిండాలపై ప్రభావం పడడం వలన తరచూ మూత్ర విసర్జన వస్తుంది. నిద్రలేమి కూడా రక్తపోటుకు లక్షణం అని గుర్తు పెట్టుకోవాలి. ఏమైనా ఇబ్బందులు ఎక్కువ ఉంటే, వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.