డ‌యాబెటిస్ ఉన్న‌వారు క‌ళ్ల‌కు సంబంధించి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే అల‌ర్ట్ అవ్వాలి.. లేదంటే కంటి చూపు పోతుంది..!

డ‌యాబెటిస్ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఏటా అనేక మంది టైప్ 1, 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. అయితే మ‌ధుమేహం వ‌చ్చిన వారు జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే అనేక అవ‌య‌వాలు పాడైపోతాయి. ముఖ్యంగా క‌ళ్లు దెబ్బ తింటాయి. అందువ‌ల్ల షుగ‌ర్ ఉన్న‌వారు త‌మ షుగ‌ర్ లెవ‌ల్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు క‌ళ్ల‌కు సంబంధించి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే అల‌ర్ట్ అవ్వాలి.. లేదంటే కంటి చూపు పోతుంది..!

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు నిర్ల‌క్ష్యం చేస్తే అనేక అవ‌య‌వాలు దెబ్బ తింటాయి. క‌ళ్లు క‌నిపించకుండా పోతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారు కింద తెలిపిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే క‌ళ్ల‌కు స‌మ‌స్య వ‌చ్చింద‌ని అర్థం చేసుకోవాలి. ఆ ల‌క్ష‌ణాలు ఏమిటంటే..

కంటి చూపు స్ప‌ష్టంగా లేక‌పోవ‌డం, దూరంగా లేదా ద‌గ్గ‌ర‌గా ఉన్న వ‌స్తువులు, ప‌రిస‌రాలు మ‌స‌క‌గా క‌నిపిస్తుండ‌డం, ఒకే రంగుకు చెందిన భిన్న ర‌కాల షేడ్స్ ను గుర్తించ‌లేక‌పోవ‌డం, క‌ళ్ల‌తో చూస్తున్న‌ప్పుడు చూపులో న‌ల్ల‌ని గీత‌లు, మ‌చ్చ‌లు క‌నిపించ‌డం, కాంతి తక్కువ‌గా ఉన్న ప్ర‌దేశంలో వ‌స్తువుల‌ను చూస్తుంటే క‌ళ్లు ఒత్తిడికి గుర‌వడం.. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో క‌ళ్ల‌కు వ‌చ్చే స‌మ‌స్య‌లు. ఇలా గ‌న‌క ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాదు. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి క‌ళ్ల‌ను ప‌రీక్ష చేయించుకోవాలి.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిర్లక్ష్యం చేస్తే క‌ళ్లు పై విధంగా ముందు ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డి త‌రువాత చూపు పోయే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక షుగ‌ర్ లెవ‌ల్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇందుకుగాను స‌రైన ఆహారం తీసుకోవ‌డంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. వైద్యులు ఇచ్చే మందుల‌ను తూచా త‌ప్ప‌కుండా వేసుకోవాలి. దీంతో షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది. క‌ళ్లు దెబ్బ తిన‌కుండా సుర‌క్షితంగా ఉంటాయి.

Share
Admin

Recent Posts