Liver Health : మన శరరీంలోని అనేక అవయవాల్లో లివర్ ఒకటి. ఇది అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి తనలో నిల్వ చేసుకుంటుంది. అనంతరం శరీరానికి ఆ పోషకాలను అందిస్తుంది. ఇలా లివర్ ఎన్నో పనులను చేస్తుంది.
అయితే లివర్‌లో ఏవైనా సమస్యలు ఉంటే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా మన పాదాలను చూసి లివర్ సమస్య ఉందో, లేదో సులభంగా తెలుసుకోవచ్చు. పాదాలపై పలు లక్షణాలు మనకు కనిపిస్తాయి. వాటిని పరిశీలించి మనకు లివర్ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. లివర్‌లో సమస్యలు ఉంటే పాదాలపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లివర్‌లో ఏమైనా సమస్యలు ఉన్నా, లివర్ చెడిపోయినా.. లివర్ వ్యాధులు ఉన్నా.. పాదాలపై ఎర్రని మచ్చలు వస్తుంటాయి. ఇవి చిన్న చిన్న గుల్లల మాదిరిగా వస్తాయి. చీమ లేదా దోమ కుడితే ఎలాగైతే చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు వస్తాయో అలా కనిపిస్తాయి. పాదాలపై అలాంటి ఎర్రని మచ్చలు కనిపిస్తుంటే లివర్ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
2. కొందరికి రక్త సరఫరా సరిగ్గా లేకపోయినా పాదాలపై ఎర్రని లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తుంటాయి.
3. లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే పాదాలపై లేదా మోకాలి వెనుక వైపు ఎర్రని చారల వంటి రక్త నాళాలు కనిపిస్తాయి. చూసేందుకు అవి సాలెగూడులా ఉంటాయి.
4. లివర్ సమస్యలు ఉన్నవారిలో కొందరికి మడమలు లేదా పాదాలు వాపులకు గురై, నీరు వచ్చి కనిపిస్తాయి.
5. మడమల కింది వైపు పాదాలపై పగుళ్లు బాగా ఏర్పడినా కూడా లివర్ సమస్య ఉందేమోనని అనుమానించాలి.
6. లివర్ సమస్య ఉంటే కొందరికి అరికాళ్లల్లో తరచూ దురదలు వస్తుంటాయి. అక్కడ కొందరికి నొప్పి కూడా ఉంటుంది.
7. లివర్ సమస్యలు ఉంటే కొందరికి పాదాలపై తరచూ ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కాలి వేళ్ల మధ్య ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తాయి. అలాగే పాదాల నుంచి తరచూ దుర్వాసన వస్తుంటుంది.
8. కాలి వేళ్ల గోర్లపై తెల్లని మచ్చలు కనిపిస్తుంటే లివర్ సమస్యలు ఉన్నాయేమోనని చెక్ చేయించుకోవాలి. కొందరికి జింక్ లోపం వల్ల కూడా ఇలా అవుతుంది.
కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లివర్ పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.