Blood Circulation : కొన్ని కొన్ని సార్లు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది కానీ కలిగినప్పుడు మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ లక్షణాలని బట్టి మనం ఏదైనా సమస్య వచ్చిందని తెలుసుకోవచ్చు. రక్త ప్రసరణ సాఫీగా జరగకపోతే కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి సరిగ్గా రక్తప్రసరణ జరగకపోతే ఎటువంటివి కనబడుతుంటాయి..? ఏ ఇబ్బందులు ఎదుర్కోవాలి అనేది చూద్దాం.
రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడితే మన శరీరంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. రక్తనాళాలలో అడ్డంకులు ఉంటే రక్తం ప్రవహించడాన్ని కష్టతరం చేస్తుంది. ప్రత్యేకించి గుండె నుండి చాలా దూరంగా ఉన్న శరీరంలోని భాగాలని రక్తం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కణాలకి అవసరమైన ఆక్సిజన్ అందదు. రక్తప్రసరణ సక్రమంగా జరగట్లేదు అంటే ఇటువంటి లక్షణాలు కనబడతాయి. రక్తం తగినంత చేరుకోకపోయినట్లయితే సూదితో పొడిచినట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
చేతులు కాళ్లలో తిమ్మిరి, జలదరింపు వంటివి కలుగుతుంటాయి. రక్తప్రసరణ సాఫీగా జరగకపోతే శరీరంలో ఇతర భాగాలు కంటే చేతులు, కాళ్లు చల్లగా ఉంటాయి. కాళ్ల నరాలు చివర్లలో ఉష్ణోగ్రత హెచ్చుతగులకి దారితీస్తుంది. శరీరంలో దిగువ భాగంలో వాపు కూడా ఉంటుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి. పొత్తికడుపులోని రక్తనాళాల లైనింగ్ లో పేరుకుపోయే కొవ్వు పదార్థాలతో ఇది ముడి పడుతుంది.
దీని వలన పొత్తి కడుపు నొప్పి, కండరాల తిమ్మిరి, మలబద్ధకం ఇలా సమస్యలు కలుగుతుంటాయి. ఒకవేళ కనుక రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే చర్మం రంగులో మార్పు కూడా ఉంటుంది. పాదాలకి పుండ్లు వస్తుంటాయి. ఇలా పలు సమస్యలని రక్తప్రసరణ సాఫీగా జరగకపోతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇటువంటి లక్షణాలు కనబడితే ఒకసారి వైద్యులని సంప్రదించడం మంచిది.