Pancreatic Cancer Symptoms : క్యాన్సర్ రోగం అనేది చాప కింద నీరు లాంటిది. ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని రకాల క్యాన్సర్లు అయితే సడెన్‌గా వస్తాయి. కానీ కొన్ని క్యాన్సర్లు వచ్చే ముందు మనకు మన శరీరం కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని బట్టి మనం అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో మనం త్వరగా చికిత్స తీసుకుని క్యాన్సర్‌ను తరిమేయవచ్చు. ఇక పాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా కొన్ని లక్షల మంది చనిపోతున్నారు.
కానీ పాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తే ఆరంభంలోనే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు భోజనం చేసే సమయంలో ఆహారాన్ని నమిలాక మింగేటప్పుడు గొంతులో బాగా నొప్పిగా ఉంటుందా. అయితే అది పాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే క్యాన్సర్ కణాలు ఏర్పడితే ఆహార నాళం, ఆ భాగంలో ట్యూమర్లు తయారై అక్కడి భాగాలు కుచించుకుపోతాయి. దీంతో ఆహారం కిందకు వెళ్లదు. ఫలితంగా మనకు నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణం గనుక ఎవరిలో అయినా కనిపిస్తే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలవాలి.
ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలే..
ఇక అజీర్తి, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, అసిడిటీ వంటివన్నీ సాధారణ జీర్ణ సమస్యలే. తరచూ అందరికీ వస్తూనే ఉంటాయి. కానీ ఇవి వచ్చినప్పుడు మీకు గొంతులో ఆహార నాళం లేదా పొట్ట భాగంలో నొప్పిగా కనుక ఉంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. ముఖ్యంగా మీకు నోటి నుంచి గ్యాస్ బయటకు వెళ్లేటప్పుడు నొప్పిగా ఉంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే. లేదంటే ప్రాణాల మీదకు రావచ్చు.
అలాగే కొందరు కొన్ని రకాల మెడిసన్లను వాడడం వల్ల, లేదా వయస్సు మీద పడడం వల్ల కొందరికి కాస్త ఆహారం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అధిక బరువు తగ్గించే మందులను లేదా ఇతర హెర్బల్ ఔషధాలను వాడినా కూడా కాస్త తినగానే కడుపు నిండినట్లు అవుతుంది. అయితే మీరు ఇలాంటివేవీ వాడకున్నా మీకు కాస్త తినగానే కడుపు నిండిపోతుందని అనిపస్తున్నా, కడుపులో నొప్పి వస్తున్నా దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే. సాధారణంగా పాంక్రియాటిక్ లేదా అండాశయ, జీర్ణాశయ క్యాన్సర్ అయితే ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. కనుక ఈ లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
వెంటనే డాక్టర్‌ను కలవాలి..
కొందరికి పలు రకాల కారణాల వల్ల లేదా మెడిసిన్లను తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ వికారంగా వాంతికి వచ్చినట్లు ఉంటుంది. అయితే అదే సమయంలో కడుపులో లేదా గొంతులో గనుక నొప్పిగా ఉంటే మాత్రం దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా ఇలాగే జరుగుతుంది. అలాగే జీర్ణాశయ, పాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారిలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. ఇక పాంక్రియాటిక్ లేదా జీర్ణాశయ క్యాన్సర్ ఉంటే విరేచనం సాఫీగా అవదు. లేదా డయేరియా మాదిరిగా నీళ్ల విరేచనాలు అవుతాయి. ఆ సమయంలో కడుపులో నొప్పిగా కూడా ఉంటుంది. ఈ లక్షణం కనుక ఉంటే దాన్ని కూడా క్యాన్సర్‌గా అనుమానించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ ఉందని తేలితే ముందుగానే మందులను వాడవచ్చు. క్యాన్సర్‌ను తరిమేయవచ్చు. దీంతో ప్రాణాల మీదకు రాకుండా మనల్ని మనం కాపాడుకున్నవారము అవుతాము.