Onions : మనలో చాలా మంది ఉల్లిపాయలను పచ్చిగా తినేందుకు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఉల్లిపాయల్లో అనేక ఔషధ గుణాలతోపాటు పోషకాలు కూడా ఉంటాయి. కనుక వీటిని తింటే లాభాలను పొందవచ్చు. రోజుకు ఒక సాధారణ సైజ్‌లో ఉన్న పచ్చి ఉల్లిపాయను తినవచ్చు. కానీ అంతకు మించితే మాత్రం దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి ఉల్లిపాయలను శుభ్రంగా కడిగిన తరువాతే తినాలి. లేదంటే సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇది టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. కనుక శుభ్రంగా కడిగిన తరువాతే ఉల్లిపాయలను తినడం మంచిది.
2. పచ్చి ఉల్లిపాయలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి ఉల్లిపాయలు పడవు. అలాంటి వారిలో కూడా ఈ విధమైన లక్షణాలు కనిపిస్తాయి.
3. ఉల్లిపాయలను అధికంగా తింటే గ్యాస్ ట్రబుల్ సమస్య ఏర్పడుతుంది. కొందరికి అపానవాయువు అధికంగా వస్తుంది. కొందరికి కడుపులో నొప్పి వస్తుంది. కొందరిలో గుండెల్లో మంట కనిపిస్తుంది.
4. ఉల్లిపాయలను అధికంగా తినడం వల్ల కొందరికి అలర్జీలు వస్తాయి. దీంతో చర్మం, జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతాయి.
కనుక ఉల్లిపాయలను మోతాదులో మాత్రమే తినాలి. మోతాదకు మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.