Ear Itching : సహజంగానే చాలా మందికి చెవులు దురదలు పెడుతుంటాయి. కొందరికి ఇయర్ ఫోన్స్ ధరించినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చెవుల్లో దురదలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. చెవుల్లో బాక్టీరియా ఎక్కువగా చేరినప్పుడు దురదలు వస్తాయి. అలాగే వైరస్‌ల వల్ల కూడా చెవులు దురదలు పెడుతుంటాయి. కొందరికి దగ్గు, జలుబు చేసినప్పుడు ఆ వైరస్‌లు చెవుల్లోకి ప్రవేశించి దురదను కలగజేస్తాయి. కనుక ఇలా కూడా కొందరికి చెవుల్లో దురదగా ఉంటుంది.
ఇక కొందరికి చెవుల్లో గులిమి అంత ఎక్కువగా ఉత్పత్తి కాదు. కొందరికి చెవుల్లో సహజసిద్ధమైన నూనెలు ఉత్పత్తి కావు. దీంతోపాటు కొందరు తరచూ గులిమిని తీస్తుంటారు. దీంతో చెవులు పొడిగా మారుతాయి. ఇవన్నీ చెవుల్లో దురదలు వచ్చేందుకు కారణమవుతుంటాయి.
కొందరికి కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల చెవుల్లో దురదలు వస్తుంటాయి. ఫుడ్ అలర్జీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కొందరికి పాలు, చేపలు, సోయా, యాపిల్స్, చెర్రీలు, కివీ పండ్లు పడవు. ఇవి చెవుల్లో రియాక్షన్స్‌ను కలగజేస్తాయి. దీంతో చెవుల్లో దురదగా ఉంటుంది.
కొందరికి చెవుల్లో అతి ఎక్కువగా గులిమి ఉత్పత్తి అవుతుంటుంది. ఇది కూడా చెవుల్లో దురదకు కారణం అవుతుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు చిన్నపాటి చిట్కాలను పాటిస్తే చాలు.. ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. కొందరికి ఇయర్ ఫోన్స్ ధరించడం వల్ల వాటిపై ఉండే బాక్టీరియా చెవుల్లో చేరి అక్కడ దురదను కలగజేస్తాయి. కనుక ఈ సమస్యకు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
చెవుల్లో రెండు మూడు చుక్కలు కొబ్బరినూనె లేదా నువ్వుల నూనె వేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. తరువాత చెవుల్లో దూది ఉంచాలి. ఇలా చేస్తుంటే చెవుల్లో దురద తగ్గుతుంది. ఆయా నూనెల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల చెవుల్లో ఉండే సూక్ష్మ జీవులు నశిస్తాయి. దీంతో దురద కూడా తగ్గుతుంది. ఇక చెవులను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. గులిమిని మరీ ఎక్కువగా తీయరాదు. ఈ సూచనలు పాటించినా.. దురద తగ్గడం లేదంటే.. డాక్టర్‌ను కలవాలి. లేదంటే సమస్య మరింత ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఉంటాయి.