హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. వస్తే మాత్రం సడెన్ షాక్‌ను ఇస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చాక వీలైనంత త్వరగా బాధితులను హాస్పిటల్‌కు తరలించాలి. లేదంటే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు కొన్ని రోజులు లేదా ఒక వారం ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని పరిశీలించడం ద్వారా హార్ట్ ఎటాక్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. దీంతో ముందుగానే జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. మరి హార్ట్ ఎటాక్ వచ్చేందుకు కొన్ని రోజులు లేదా ఒక వారం ముందు కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. చిన్న పని చేసినా తీవ్రమైన అలసట, నీరసం వస్తున్నా, లేదా కొద్దిగా మెట్లు ఎక్కితేనే ఆయాసం వస్తున్నా.. ఇవి హార్ట ఎటాక్‌కు ముందు సూచనలుగా భావించాలి. అలాగే కొందరికి ఛాతిలో నొప్పితోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఇవి ఉంటే గుండెకు ఏదో ప్రమాదం రాబోతుందని ముందుగానే గ్రహించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
2. ఎంత ప్రయత్నించినా నిద్ర సరిగ్గా రావడం లేదని చెప్పేవారికి, నిద్ర లేమి సమస్య ఉన్నవారికి హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమెరికాకు చెందిన సీడీసీ పరిశోధకులు చెబుతున్నారు. కనుక రోజూ నిద్ర సరిగ్గా వచ్చేలా చేసుకోవాలి. నిద్ర లేమి నుంచి బయట పడాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
3. చాలా మంది ఒత్తిడి, ఆందోళనలకు గురవుతుంటారు. ఇది సహజమే. అయితే ఈ లక్షణాలు మరింత ఎక్కువవుతూ ఉంటే అవి హార్ట్ ఎటాక్ వచ్చేందుకు కారణమవుతాయి. కనుక వాటి నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి.
4. ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో నొప్పిగా ఉండడం, దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పి గా ఉండడం, ఛాతిలో అసౌకర్యంగా అనిపిస్తుండడం.. ఇవన్నీ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరరీం చూపించే సంకేతాలు. కనుక ఇవి ఎవరిలో అయినా కనిపిస్తుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. ఒక వేళ నిజంగానే గుండెకు సంబంధించిన సమస్య అయితే ఆ పరీక్షల ద్వారా ముందుగానే తెలుస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్రత్త పడవచ్చు.