ప్రపంచవ్యాప్తంగా ఏటా అనేక మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. వంశ పారంపర్యంగా డయాబెటిస్ సమస్య వస్తుంటే.. చాలా మందికి అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా డయాబెటిస్ వస్తోంది. దీంతో ఆ వ్యాధి నుంచి బయట పడడం కష్టంగా మారింది. అయితే డయాబెటిస్ వచ్చిన వారిలో ఆరంభంలో నోట్లోనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం ద్వారా డయాబెటిస్ వచ్చిందని నిర్దారించవచ్చు. దీంతో త్వరగా చికిత్స తీసుకుని దాని నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది. మరి డయాబెటిస్ ఆరంభంలో నోట్లో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. డయాబెటిస్ వచ్చిన వారిలో సహజంగానే నీరు తక్కువగా ఉంటుంది కనుక నోరు తడారిపోతుంది. దీంతో నోరు పొడిగా మారుతుంది. దీని వల్ల ఎప్పుడూ నీళ్లను తాగాలని అనిపిస్తుంది. నోట్లో తేమ ఉండదు. పొడిగా కనిపిస్తుంది. ఈ లక్షణం ఉంటే డయాబెటిస్ వచ్చినట్లే అర్థం చేసుకోవాలి.
2. నోట్లో నొప్పి, దంత క్షయం, చిగుళ్ల వాపులు ఉన్నా డయాబెటిస్‌కు ఆరంభ లక్షణాలుగా భావించాలి.
3. డయాబెటిస్ వచ్చిన వారిలో పెదవులు పగిలి పొడిబారి కనిపిస్తాయి. నోట్లో పూతలు, పుండ్లు వస్తాయి. నాలుకపై కూడా అలాగే ఏర్పడుతాయి. నాలుకపై తెల్లని పూతలా వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్‌గా అనుమానించాలి.
4. ఆహారం లేదా ద్రవాలను మింగుతున్నప్పుడు నొప్పి వస్తున్నా, మింగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా, మాట్లాడడం, నమలడం ఇబ్బందిగా ఉన్నా దాన్ని డయాబెటిస్ లక్షణంగా భావించాలి.
5. డయాబెటిస్ వచ్చిన వారిలో చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటుంది. నోట్లో బాక్టీరియా ఎప్పటికీ ఉండి దుర్వాసన వస్తుంది.
అయితే పలు ఇతర సమస్యల వల్ల కూడా నోట్లో పై విధంగా లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్‌ను కలిసి ముందుగా షుగర్ పరీక్ష చేయించుకుంటే మంచిది. షుగర్ లేకపోతే ఆయా లక్షణాలు ఎందువల్ల వచ్చాయో తెలుసుకుని ఆ ప్రకారం మందులను వాడాలి. ఏది ఏమైనా పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.