రోజూ మనం పాటించే జీవన విధానం, తీసుకునే ఆహారాలు.. వంటి అనేక కారణాల వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితమవుతుంటుంది. సరైన అలవాట్లు పాటిస్తూ, నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే హార్ట్ ఎటాక్ లు లేదా ఇతర గుండె జబ్బులు వస్తాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్లర్. అది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో అస్సలు తెలియదు. కానీ హార్ట్ ఎటాక్ వచ్చేందుకు నెల రోజుల ముందు మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా గుండెకు జరిగే ప్రమాదాన్ని నివారించవచ్చు. ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుని గుండెను రక్షించుకోవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకునేందుకు వీలుంటుంది. మరి గుండె పోటు వచ్చేందుకు నెల రోజుల ముందు మన శరీరంలో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కొందరు చిన్న పనిచేసినా అలసిపోతుంటారు. మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలు గనక ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. డాక్టర్‌ను కలిసి గుండె పరీక్షలు చేయించుకోవాలి.
2. నిద్రలేమి సమస్య ఉన్నవారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ ఎంత సేపు బెడ్‌పై పడుకున్నా నిద్ర రావడం లేదంటే దాన్ని హార్ట్ ఎటాక్‌కు సూచనగా అనుమానించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. నిద్రలేమి సమస్య నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి.
3. ఎక్కువగా ఆందోళన చెందుతున్నా హార్ట్ ఎటాక్ వచ్చేందుకు కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవారు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
4. ఉన్నట్టుండి సడెన్ గా బీపీ పెరిగి అది అలాగే ఉంటే దాన్ని హార్ట్ ఎటాక్ వచ్చే ముందు సంకేతంగా అనుమానించాలి. వెంటనే బీపీని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
5. ఎడమ వైపు ఛాతి నుంచి చేతి వైపుకు నొప్పి సూదులతో గుచ్చినట్లు వస్తున్నా.. లేదా గుండెకు ఎడమ వైపు ఛాతిలో నొప్పి వస్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు సూచనగా అనుమానించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కనుక ఈ లక్షణాలు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
6. వాతావరణం చల్లగా ఉన్నా కొందరికి చెమటలు వస్తుంటాయి. ఇలా గనక ఎవరికైనా ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చేందుకు సూచనగా అనుమానించాలి. నిర్లక్ష్యం చేయరాదు.
పైన తెలిపినవి హార్ట్ ఎటాక్ వచ్చేందుకు కొన్ని రోజుల ముందు కనిపించే సూచనలు. ఇవి ఎవరిలో అయినా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365