Urination : మన శరీరంలోని మలినాలు, విష పదార్థాలు ఎక్కువగా మూత్ర ద్వారా బయటకు పోతాయన్న సంగతి మనకు తెలిసిందే. మూత్రవిసర్జన చేయకపోతే మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే మూత్రవిసర్జన ఏ సమయంలో చేయడం మంచిది అన్న సందేహం కూడా మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. మూత్రవిసర్జన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఏ సమయంలో మూత్రవిసర్జన చేస్తే మంచిది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర విసర్జన ఉదయం పూట పరగడుపున ఎక్కువగా చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మూత్రవిసర్జన చేయడం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్థాలు ఎక్కువగా బయటకు పోతాయి. మన శరీరంలో ఆహారం జీర్ణమైన దగ్గరి నుండి కాలేయం వ్యర్థాలను బయటకు పంపించే పనిలో ఉంటుంది.
శరీరంలో ఉండే వ్యర్థాలు, పురుగు మందులు, ఇతర అనారోగ్య సమస్యలకు వాడిన మందుల్లో ఉండే అవశేషాలను, శరీరంలో విడుదలైన టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ ను మన కాలేయం ఫేస్ 1, ఫేస్ 2 లో నిర్వీర్యం చేసి ఫేస్ 3 లో మూత్రం ద్వారా బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా రాత్రి పూట మన శరీరంలో జరుగుతుంది. అందుకే మనం ఉదయం పూట విసర్జించే మూత్రం ఘూటుగా వాసనను కలిగి ఉంటుంది. ఉదయం పూట ఒక్కసారి మూత్ర విసర్జన చేయగానే ఈ వ్యర్థ పదార్థాల్నీ బయటక పోవు. కొన్ని విష పదార్థాలు అలాగే రక్తంలో ఉంటాయి. కనుక ఎక్కువ సార్లు ఉదయం పూట మూత్ర విసర్జన చేయాలి. ఉదయం పూట లీటర్ నుండి లీటర్నర వరకు మూత్ర విసర్జన చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం లేచిన తరువాత లీటర్ నుండి లీటర్నర నీటిని తాగాలి.

ఇలా తాగడం వల్ల ముప్పావు లీటర్ నుండి లీటర్ వరకు మూత్ర రూపంలో బయటకు వస్తుంది. ఇలా నీటిని తాగిన రెండు గంటల తరువాత మరలా నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల రక్తంలో మిగిలిన వ్యర్థాలన్నీ మూత్రపిండాలకు చేరుతాయి. మూత్రిపిండాల నుండి ఆ వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు వస్తాయి. ఇలా ఉదయం పూట రెండు లీటర్ల మోతాదులో మూత్రవిసర్జన చయడం వల్ల కాలేయం విడగొట్టిన వ్యర్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వస్తాయి. ఉదయం పూట ఒకటిన్నర నుండి రెండు లీటర్ల నీటిని తాగి మూత్ర విసర్జన చేయడం వల్ల మన శరీరంలోని మలినాలన్నీ తొలగిపోయి అంతర్గతంగా శరీరం శుభ్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట పరగడుపున ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని వారు చెబుతున్నారు.