ఈ టాబ్లెట్ పేరు ఎక్స్ ఎల్ ఎస్ మెడికల్ ఫ్యాట్ బైండర్. ఇందులో వుండేది ఎండిపోయిన కాక్టస్ మొక్క ఆకులలోని ఫైబర్ మాత్రమే. ఈ యాంటీ ఓబేసిటీ మాత్ర కనుక వేస్తే మహిళలు డైటింగ్ చేస్తూ తగ్గే బరువుకంటే కూడా మూడు రెట్లు బరువు అధికంగా తగ్గిపోతారని సైంటిస్టులు చెపుతున్నారు.
అంతేకాదు, ఈ టాబ్లెట్ వేస్తే, అది తినాలని, ఇది తినాలనే ధ్యాస కూడా మాయమవుతుందట. ఎక్కువసేపు కడుపు నిండుగా వున్నట్లు అనిపించి ఆకలిని చంపేస్తుందట. డైటింగ్ చేసి ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఒక దివ్యమైన ఔషధంగా చెపుతున్నారు. ఇక శరీరంలో కొవ్వు నిల్వలు ప్రతిరోజూ వేసే ఈ టాబ్లెట్ లో దగ్గరకు చేరవంటున్నారు.
టాబ్లెట్ వేస్తూ, మితమైన ఆరోగ్యకర ఆహారం ఎప్పటివలెనే తీసుకుంటూ వుంటే ఎప్పటికి స్మార్ట్ గానే వుండి ఆరోగ్యవంతులవుతున్నారని లండన్ లోని ఎ ఎన్ ఐ వార్తా సంస్ధ తెలుపుతోంది. ఇంతకీ ఇంతలా బరువు తగ్గించి, ఆరోగ్యాన్ని అందించే ఈ చిన్న టాబ్లెట్ ఖరీదు జస్ట్ రెండు పౌండ్లు మాత్రమేనని కూడా తెలిపింది. అయితే ఈ ట్యాబ్లెట్లు ప్రస్తుతం యూకేలోనే లభిస్తున్నాయి. త్వరలోనే ఇతర దేశాల వారికీ అందుబాటులో ఉండనున్నాయని సమాచారం.