మీ మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అవును ఇది అక్షరాల నిజం. మానవ శరీరంలోని వ్యర్థ పదార్థాల మొత్తమే మూత్రం. ఇందులో అమోనియా ఆమ్లాలు, యూరియా ల వంటి వ్యర్థ పదార్థాలుంటాయి. శరీరాభివృద్దికి మనం తీసుకున్న ఆహార పానియాలను మూత్రపిండాలు వడపోశాక వ్యర్థపదార్థాలు ప్రసేకం ద్వారా బయటికి విసర్జించబడతాయి. ఇది సైన్స్. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన ఆ మూత్రం రంగు చూసి మనం ఆరోగ్యపరంగా ఎంత ఫిట్ గా ఉన్నామో తెలుసుకోవచ్చు. స్పష్టమైన మూత్రం కలిగిన వారు అతిమూత్ర వ్యాధి కలిగిన వారు. మధుమేహం ఉన్న వారు తరచూ మూత్రం వెళ్ళడంతో నీరు ఎక్కువగా బయటకు వెళ్తుంది. దీని కారణంగా దాహం ఎక్కువగా వేస్తుంది, నిద్రాసమయంలో నిద్రలేస్తూ ఉంటారు. సరిగ్గా నిద్ర ఉండదు.
ముదురు పసుపు మూత్రం.. మూత్రవిసర్జన రంగు పసుపు లేదా ముదురు పసుపు రంగులో ఉన్నట్లయితే అలాంటి వారు ఎక్కువగా నీరు తీసుకోవాలి. నియాన్ పసుపు రంగు.. ఇలాంటి మూత్రరంగు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విటమిన్ బి, విటమిన్ సి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇది ఎక్కువకాలం ఉండదు. మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు అది తగ్గిపోతుంది. ఆరంజ్ రంగు మూత్రం.. నిర్జలీకరణ లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వలన ఈ రంగు వస్తుంది. ఇది తిత్తి లేదా కణతి కామెర్లకు దారితీస్తుంది.
నీలం రంగులో.. ఆహారం, కొన్ని రకాల మందులను తీసుకోవడం వలన ఈ రంగుకి కారణం అవుతుంది. ఎరుపు రంగు మూత్రం.. ఈ విధంగా ఉంటే సహజమైన ఆహారమే కారణం. ఇది కొన్నిసార్లు ఇలా ఉండటం, వేడిగా ఉండటం వలన పిత్తాశయంలో రాళ్లు, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. ఆకుపచ్చ మూత్రం.. సూడోమొనాస్ ఎరుగినోస్ అనే బ్యాక్టీరియా వలన మూత్రం ఈ రంగులో ఉంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి మరియు విరేచన వ్యతిరేక ఔషధాలను వాడడం కూడా ఈ రంగుకు కారణం కావచ్చు.