గుండె పోటు.. హార్ట్ ఎటాక్.. ఇదొక సైలెంట్ కిల్లర్.. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అయితే గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఫెయిల్యూర్.. ఈ మూడూ వేర్వేరు పరిస్థితులు కానీ చాలా వరకు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అయితే ఎక్కువ శాతం హార్ట్ ఎటాక్‌లు చాలా వరకు చాలా మందికి బాత్‌రూమ్‌లలోనే వస్తాయి. ఇందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* బాత్‌రూమ్‌లో మల విసర్జన చేసినప్పుడు లేదా మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరంపై ఒత్తిడి బాగా ఉంటే అప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. ఇది హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుంది.
* కొందరు మలం లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు శరీరంపై ఒత్తిడిని కలగజేస్తారు. అంటే ముక్కినట్లు చేస్తారు. దీని వల్ల వేగస్ నాడిపై ఒత్తిడి పడుతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ వస్తుంది.
* కొందరు మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు వస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుంది. కనుక ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
* కొందరు బెడ్ మీద నుంచి లేచి వెంటనే హడావిడిగా బాత్‌రూమ్‌కు పరుగెత్తుతారు. పని కోసమో లేదా ఇతర కారణాల వల్లో ఇలా చేస్తారు. కానీ చేయడం వల్ల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగి అది హార్ట్ ఎటాక్‌ను కలగజేసేందుకు అవకాశం ఉంటుంది. కనుక బెడ్ మీద నుంచి లేచాక వెంటనే కిందకు దిగకూడదు. నెమ్మదిగా పనులు చేసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా నివారించవచ్చు.
అయితే హార్ట్ ఎటాక్ వస్తే వెంటనే హాస్పిటల్‌కు తరలించాల్సి ఉంటుంది. హార్ట్ ఎటాక్ వచ్చాక వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు పేషెంట్‌ను తరలిస్తే గుండెకు జరిగే నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు.