Blood Group : మన శరీరంలో ప్రవహించే రక్తంలో గ్రూపులు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. రక్తంలో ఎ, బి, ఒ, ఎబి అనే నాలుగు గ్రూపులు ఉంటాయి. అలాగే రక్తంలో ఆర్ హెచ్ ఆంటిజెన్ ఉంటుంది. ఇది ఉన్న వారు పాజిటివ్ బ్లడ్ గ్రూపులను కలిగి ఉంటారు. ఇది లేని వారు నెగెటివ్ బ్లడ్ గ్రూపులను కలిగి ఉంటారు. అనగా ఆర్ హెచ్ ఆంటిజెన్ ఉంటే ఎ పాజిటివ్, బి పాజిటివ్, ఎబి పాజిటివ్, ఒ పాటిజివ్ అనే బ్లడ్ గ్రూపులను కలిగి ఉంటారు. అదే ఆర్ హెచ్ ఆంటిజెన్ లేకపోతే ఎ నెగెటివ్, బి నెగెటివ్, ఎబి నెగెటివ్, ఒ నెగెటివ్ వంటి బ్లడ్ గ్రూపులను కలిగి ఉంటారు. అయితే భార్యా భర్తలు ఇద్దరు ఒకే బ్లడ్ గ్రూపును కలిగి ఉంటే గర్భం దాల్చడంలో ఆలస్యమవుతుందని, అలాగే గర్భస్రావాలు ఎక్కువగా అవుతాయని, పుట్టే పిల్లలు లోపాలతో పుడతారని ఇలా అనేక రకాల సందేహలను కలిగి ఉంటారు.
అయితే వీటిలో ఎంత వరకు నిజాలు ఉన్నాయి అసలు వైద్యులు దీని గురించి ఏమంటున్నారు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. భార్యా భర్తలు ఇద్దరు వేరువేరు బ్లడ్ గ్రూపులను కలిగి ఉంటేనే ప్రమాదమని ఒకే రకం బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు భార్య ఒ బ్లడ్ గ్రూపఉను కలిగి ఉండి భర్త ఎ, బి, ఎబి బ్లడ్ గ్రూపులను కలిగి ఉంటే పుట్టే పిల్లలు ఎబిఒ ఇన్ కంపాటబిలిటీ అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుందని దీని వల్ల పుట్టే పిల్లలు కామెర్లతో పుడతారని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా భార్య నెగెటివ్ బ్లడ్ గ్రూపును, భర్త పాజిటివ్ బ్లడ్ గ్రూపును కలిగి ఉంటే ఆర్ హెచ్ ఇన్ కంపాటబిలిటీ అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుందని దీని వల్ల కూడా పుట్టే పిల్లలు తీవ్మైన కామెర్ల సమస్యతో పుడతారని అలాగే కొన్నిసార్లు రక్తాన్ని కూడా మార్చాల్సి వచ్చే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.
ఇటువంటి సమస్యలు రాకుండా గర్భధారణ సమయంలోనే యాంటీ డి అనే ఇంజెక్షన్ ను ఇస్తారని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తల్లి నెగెటివ్ బ్లడ్ గ్రూపును కలిగి పుట్టిన బిడ్డ పాజిటివ్ బ్లడ్ గ్రూపును కలిగి ఉంటే బిడ్డ పుట్టిన 72 గంటల్లో ఈ యాంటీ డి అనే ఇంజెఓన్ ను ఇస్తారని వారు చెబుతున్నారు. అయితే మొదటి కాన్పులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని రెండో కాన్పులోనే ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మొదటి సారి గర్భస్రావం అయినప్పటికి రెండోసారి పుట్టే పిల్లలలో ఈసమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు. అదే విధంగా భార్యా భర్తలు ఒకే బ్లడ్ గ్రూపును కలిగి ఉంటే ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని అలాగే గర్భస్రావం కూడా జరగదని, పుట్టే పిల్లలో ఎటువంటి లోపాలు ఉండవని ఇవన్నీ అపోహలు మాత్రమేనని వారు చెబుతున్నారు.