Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

ఒకే నెల‌లో 2 సార్లు నెల‌స‌రి వ‌చ్చిందా.. అయితే జాగ్ర‌త్త‌..!

Admin by Admin
June 12, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒకే నెలలో నెలసరి రెండు సార్లు రావడం అనేది ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. నెలసరి అనేది ఒకసారే వస్తుంది కదా.. మాకు రెండు సార్లు వచ్చింది ఏంటి అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఆరోగ్యంగా ఉన్న మహిళలకు రెండుసార్లు నెలసరి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే రెండుసార్లు నెలసరి వస్తే ఎక్కువ శాతం మంది మహిళలు కంగారు పడిపోతారు. ఏం చేయాలో అర్థం కాక సతమవుతుంటారు. అయితే ఇలా జరగడం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చని వైద్యు నిపుణులు అంటున్నారు. శరీరంలో ఉండే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్లు నెలసరి చక్రాన్ని నియంత్రిస్తాయి. శరీరంలో ఈ హార్మోన్ల స్థాయిలు అటూఇటూ అయినప్పుడు నెలసరి క్రమం తప్పుతుంది.

పీసీఓఎస్ అనేది హార్మోన్ల సమస్య. ఇది అండాశయాల్లో చిన్న కణుతులను ఏర్పరిచి నెలసరి చక్రాన్ని క్రమం తప్పిస్తుంది. థైరాయిడ్ గ్రంథి కూడా ఈ చక్రాన్ని నియంత్రిస్తుంది. చాలా అరుదుగా నెలసరి రక్తస్రావం గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం కూడా కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఇలా ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా కొందరు మహిళలో నెలసరి ఒకే నెలలో రెండు సార్లు రావొచ్చు. ఇలా వచ్చినప్పుడు మరి ఏం చేయాలంటే?

women who get 2 times periods in a month must beware

నెలలో రెండుసార్లు నెలసరి రావడం తీవ్ర ఆరోగ్య సమస్యను సూచిస్తుండొచ్చని, కాబట్టి ఒకే నెలలో రెండోసారి నెలసరి రావడాన్ని గమనిస్తే వెంటనే స్త్రీ ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిదని నెపుణులు అంటున్నారు. ఇది చాలా ముఖ్యమని, వైద్యుడు స్త్రీలకు అన్ని పరీక్షలు చేసి తగ్గ చికిత్స అందిస్తాడు. కాబట్టి ఎవరూ కూడా ఒకే నెలలో రెండు సార్లు నెలసరి రావడాన్ని తేలికగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇది హార్మోన్ల వల్లే కలిగి ఉంటే కొన్ని సందర్భాల్లో మన డైట్ కారణంగా తగ్గిపోతుందని, కానీ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య అయితే ప్రాణాలకే ముప్పు ఉంటుంది కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని నిపుణులు అంటున్నారు.

Tags: women
Previous Post

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

Next Post

అతిగా నిద్ర వ‌స్తుందా..? అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!