Tongue Color : మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా దాని తాలూకు లక్షణం ఏదో ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో ఒక భాగమైన నాలుకపై కూడా పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మనకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చిందో సులభంగా తెలుసుకోవచ్చు. మరి నాలుక రంగును బట్టి మనకు ఉన్న వ్యాధి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
మనం ఆరోగ్యంగా ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్య లేకుంటే మన నాలుక లేత పింక్ రంగులో కనిపిస్తుంది. ఇలా ఉంటే మనకు ఎలాంటి వ్యాధి లేదని అర్థం.
నాలుక పసుపు రంగులో ఉంటే జీర్ణ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం ఉంటే నాలుక ఇలా పసుపు రంగులో కనిపిస్తుంది.
నాలుక తెలుపు లేదా బూడిద రంగులో ఉంటే శరీరంలో ఇన్ఫెక్షన్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. బాక్టీరియా, వైరస్, ఈస్ట్, ఫంగస్ వంటి ఇన్‌ఫెక్షన్లు ఉంటే నాలుక ఇలా కనిపిస్తుంది.
నాలుక పర్పుల్ కలర్‌లో దర్శనమిస్తుంటే ఊపిరితిత్తులు లేదా గుండె సమస్యలు ఉన్నాయని అర్థం. ఇలా ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. దీంతో సమస్య ఉంటే ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవచ్చు. దీని వల్ల ప్రాణాపాయ పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చు.
ఇక నాలుక బాగా ఎరుపు రంగులో ఉంటే శరీరంలో రక్తానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే గుండె సంబంధ సమస్యలు ఉన్నా నాలుక అలాగే ఎరుపు రంగులో కనిపిస్తుంది. కనుక ఇలా ఉన్నా కూడా వెంటనే జాగ్రత్త పడాలి. పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. దీంతో వ్యాధి గురించి ముందుగానే తెలుసుకుని చికిత్స తీసుకుని తీవ్ర అనారోగ్యాల పాలు కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.