రామాయణం గురించి తెలియనిది ఎవరికి చెప్పండి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దీని గురించి అందరికీ తెలుసు. రామాయణంలో జరిగిన సంఘటలన్నీ దాదాపుగా అందరికీ గుర్తే ఉంటాయి. రాముడు, సీత జననం దగ్గర్నుంచి వారి అంత్య దశ వరకు అందులో జరిగిన ఘట్టాలన్నీ మనకు కళ్ల ముందు మెదులుతాయి. అయితే ఇవన్నీ కాకుండా… రామాయణం గురించి చాలా మందికి తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. రామునికి ముగ్గురు తమ్ముళ్లు. లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు అని ఉంటారు కదా. అయితే వీరికి ఓ సోదరి కూడా ఉంటుంది. ఆమె పేరు శాంత.
2. రావణుడికి 10 తలలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే అవి అతనికి ఎలా వచ్చాయంటే… రావణుడు గొప్ప శివ భక్తుడు. శివున్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో అతను 10 సార్లు తన తలను అర్పిస్తాడు. అలా తలను అర్పించే ప్రతిసారి కొత్తగా తల పుట్టుకు వస్తుంది. దీంతో అతనికి 10 తలలు ఏర్పడేలా శివుడు వరం అనుగ్రహిస్తాడు. 3. రావణుడు పరిపాలించింది లంకా నగరాన్ని అని తెలుసు. అయితే నిజానికి అది కుబేరుని రాజ్యం. కుబేరుడు రావణుడి సోదరుడు. రావణుడు అక్రమంగా దాడి చేసి కుబేరుడికి చెందిన లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అనంతరం అతను దాన్నే పరిపాలిస్తాడు. 4. రాముడు అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారమే. అయితే రాముడి తమ్ముడు లక్ష్మణుడు కూడా ఓ దేవుడికి అవతారమే. ఆదిశేషువే లక్ష్మణుడి రూపంలో జన్మిస్తాడు.
5. రాముడు 14 ఏళ్లు అరణ్య వాసం చేస్తాడు కదా. అయితే ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు కూడా వారి వెన్నంట ఉంటాడు. ఈ క్రమంలో ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు అసలు నిద్రే పోలేదట. అందుకు గాను తనకు నిద్ర రాకుండా చూడాలని నిద్రా దేవిని లక్ష్మణుడు ప్రార్థించాడట. అతని కోరికను మన్నించి ఆమె అతనికి వరం ఇస్తుందట. దీంతో అతను అలా 14 ఏళ్ల పాటు నిద్ర పోకుండా ఉన్నాడట. 6. జర అనే రాక్షసుడు శ్రీకృష్ణున్ని చంపుతాడు కదా. అయితే అతను అంతకు ముందు యుగంలో అంటే రాముడు పాలించిన త్రేతాయుగంలో బలి చక్రవర్తి అట. మరుసటి జన్మలో జరగా జన్మించి అతను కృష్ణున్ని సంహరిస్తాడు.
7. ఒకానొక సమయంలో రాముడు, యముడు ఇద్దరూ సమావేశమవుతారు. అయితే ఆ సమయంలో ఎవరు వచ్చి తమకు అంతరాయం కలిగించినా వారిని చంపేయాలని రాముడు ఆదేశిస్తాడట. ఇదే క్రమంలో లక్ష్మణుడు వస్తాడట. అప్పుడు లక్ష్మణుడు అన్న రాముని ఆదేశాలను పాటిస్తూ తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడట. 8. రాముడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీత ఎప్పుడు తన నుదుటన సింధూరం పెట్టుకునేదట. ఇదే విషయాన్ని ఆమె హనుమంతుడికి చెప్పగా అప్పుడు హనుమ తన శరీరం మొత్తం సింధూరమయం గావిస్తాడట. రాముడికి ఎల్లప్పుడూ ఏమీ కాకూడదని, అతను ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుతూ హనుమ ఆ పనిచేస్తాడట. దీంతో హనుమకు భజరంగబలి అనే పేరు వచ్చిందట. భజరంగ అంటే సింధూరమని అర్థం. అందుకే హనుమకు ఆ పేరు వచ్చింది.
9. రావణుడి లంకా నగరాన్ని వానర సైన్యంతో సహా చేరుకునేందుకు రాముడు సేతువు (బ్రిడ్జి) నిర్మిస్తూ ఉంటాడు. అప్పుడు వానర సైన్యం మొత్తం బండరాళ్లు, ఇసుకను సముద్రంలో వేస్తుంటారు. అయితే అది చూసి ఓ ఉడుత కూడా తనకు చేతనైనంతలో కొంత ఇసుకను తీసుకెళ్లి వంతెన నిర్మాణంలో వేస్తుందట. దీంతో రాముడు ఆ ఉడతను మెచ్చుకుని దాని వీపుపై చేతితో ఆప్యాయంగా రాసినట్టు తడుముతాడట. అప్పుడు ఆ ఉడత వీపుపై 3 తెల్లని గీతలు ఏర్పడుతాయట. దీంతో అప్పటి నుంచి ఉడతలకు వీపుపై అలా తెల్లని గీతలు పడుతున్నాయట.
10. రాముడ్ని చూసి మోహించినందుకు లక్ష్మణుడు శూర్ఫనఖ అనే స్త్రీ ముక్కు కోస్తాడు కదా. నిజానికి ఆమె రావణుడి చెల్లెలే. ఆమె అంటే అన్న అయిన రావణుడికి ఎంతో ప్రేమ. కానీ చివరికి ఆమె రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె భర్త దుష్టబుద్ధిని రావణుడు చంపుతాడు. దీంతో ఆమె తన అన్న రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది. అది అలాగే జరుగుతుంది.