Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

శాపం కార‌ణంగానే శ్రీకృష్ణుడు అవ‌తారం చాలించాడా..?

Admin by Admin
June 27, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శ్రీ కృష్ణుడు అవతారం చాలించాడు, ఆతర్వాత ద్వారక నీటమునిగిందని చెబుతారు.. అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని.. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్ధాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో తన వందమంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి.. ద్వారక మునిగిపోవాలని, కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు, సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి. ఆ ఏడుపు గాంధారిది. ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చుని ఏడుస్తుంటుంది. ఆ సమయంలో పాండవులు, కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు.

ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి..నేను నిత్యం పూజించే శ్రీమహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది. విష్ణువు రూపమైన నీకు సాధ్యం అయి కూడా ఆపని చేయలేదని నిందిస్తుంది. మీ తల్లి దేవకిని అడుగు..బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది…ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది..నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది. గాంధారి మాటలు విన్న కృష్ణడు ఓ చిరునవ్వు నవ్వి..ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటాడు. అప్పటికీ ఆగ్రహం చల్లారని గాంధారి.. నా విష్ణు భక్తి నిజమైతే … నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈరోజు నుంచి 36ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది. అంతేకాదు.. యాదవులు కూడా ఒకర్నొకరు కొట్టుకు చస్తారని, ద్వారక నీట మునుగుతుందని శపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి..తాను పెట్టిన శాపం గుర్తుచేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా.. ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు.

because of gandhari curse lord sri krishna died

మహాభారత యుద్ధంలో కౌరవులకు భీష్మ పితామహుడు, గురు ద్రోణుడు వంటి ఎందరో అనుభవజ్ఞులైన యోధులు అండగా నిలిచారు. కౌరవుల తరపున రణరంగంలో నిలిచారు. మరోవైపు శ్రీ కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చాడు. శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించారు. కౌరవులు అందరూ మరణించారు. మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేసి వారు గెలవడానికి శ్రీ కృష్ణుడే కారణమని.. అదే సమయంలో తన కుమారులందరూ మరణించడానికి కూడా కృష్ణుడే కారణమని ఆమె నమ్మింది. అంతేకాదు శ్రీ కృష్ణుడు కోరుకుంటే మహాభారత యుద్ధం జరిగేది కాదని.. తనకు పుత్ర శోకం ఉండేది కాదని గాంధారి నమ్మింది. అయితే యుద్ధాన్ని కోరుకున్న శ్రీ కృష్ణుడు పాండవులకు అండగా నిలబడి తన వంశం వినాశనానికి కారణం అయ్యాడని.. కోపంతో శ్రీకష్ణుడిని గాంధారి శపించింది. మహాభారత యుద్ధంలో నా వంద మంది కొడుకులు చనిపోయినట్లే.. నువ్వు కూడా మరణిస్తావు.. అని శాపం పెడుతుంది.

గాంధారి తన నూరుగురు కుమారులను పోగొట్టుకుని గర్భ శోకాన్ని అనుభవిస్తూ.. ఆ కోపముతో శ్రీకృష్ణుని నిందించింది. నేను నిర్మలమైన భక్తితో విష్ణుమూర్తిని పూజించినట్లయితే నా కుటుంబం ఎలా నాశనమైందో.. అదే విధంగా మీ వంశం నాశనం అవుతుంది. మీ కళ్ల ముందు విధ్వంసం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉంటారు. కానీ ఆ వినాశనాన్ని ఏ విధంగా ఆపలేరు.. అంటూ గాంధారీ కృష్ణుడికి శాపం ఇచ్చింది. గాంధారి మాటలు విన్న శ్రీకృష్ణుడు అమ్మా.. నీవు ఇచ్చిన శాపాన్ని నేను వరంగా భావిస్తున్నాను. ఈ నీ శాపాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు. యుధిష్ఠిరుని పట్టాభిషేకం తర్వాత శ్రీ కృష్ణుడు ద్వారకా నగరానికి తిరిగి చేరుకున్నాడు. మహాభారత యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజ రూపం దాల్చి.. ముసలం పుట్టి యదు వంశాన్ని నాశనం చేసింది. ద్వారకా నగరం మొత్తం నీటిలో మునిగిపోయిందని నమ్ముతారు.

ఆ తర్వాత 36 ఏళ్లు కృష్ణుడు సత్యభామ, రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు. తరువాత 36 ఏళ్ళు భార్య రుక్మిణి… కుమారుడు సాంబతో సంతోషంగా జీవిస్తాడు. ఓ సారి సప్త రుషులంతా శ్రీకృష్ణ, బలరాముల్ని చూసేందుకు ద్వారకను సందర్శిస్తారు. ఆ సప్త రుషులను ఆటపట్టించేందుకు సాంబ ఒక చిలిపి పని చేస్తాడు. ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు… దీంతో ఆగ్రహానికి గురైన రుషులు..అదే నిజమై నీ గర్భంలోంచి జన్మించిన బిడ్డద్వారా మీ యాదవవంశం నాశనమవుతుందని శపిస్తారు. అదే జరుగుతుంది. గాంధారి శాపం గుర్తుచేసుకుని యాదవ వంశం నాశనమైపోయింది, 36 ఏళ్లు గడిచిందినే శోకంతో ఓ చోట కాలిపై కాలు వేసుకుని ఆలోచనలో మునిగిపోతాడు కృష్ణుడు. ఆ సమయంలో కదులుతున్న కాలివేలు చూసి పక్షి అని భ్రమపడి వేటగాడు బాణం వేస్తాడు. అలా శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు.

Tags: gandhariLord Sri Krishna
Previous Post

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

Next Post

వినాయ‌కుడు బ్ర‌హ్మ‌చారి క‌దా.. ఆయ‌న‌కు ఇద్ద‌రు భార్య‌లు ఎలా అయ్యారు..?

Related Posts

హెల్త్ టిప్స్

ప్రీ డ‌యాబెటిస్ ఉంటే ఈ సూచ‌న‌లు పాటిస్తే షుగ‌ర్ రాకుండా ఆప‌వ‌చ్చు..!

July 12, 2025
వ్యాయామం

ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేస్తే చాలు.. పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..

July 12, 2025
హెల్త్ టిప్స్

ఈ పోష‌కాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ గుండె ప‌దిలం..!

July 12, 2025
information

బోగీల‌ను పెంచితే వందే భార‌త్ రైలు నెమ్మ‌దిగా న‌డుస్తుందా..?

July 12, 2025
Off Beat

జంతువులు మనల్ని తిన్నప్పుడు మనం మాత్రం జంతువులని ఎందుకు తినకూడదు?

July 12, 2025
వైద్య విజ్ఞానం

మనం ఫంక్షన్ల లలో వాడే పేపర్ ప్లేట్స్ ఎంత వరకు సేఫ్? వాటి వలన మనకు కలిగే ఇబ్బందులు ఏమిటి ?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.