mythology

బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే మన దేశం దశ మారినట్టే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశం అపారమైన సంపద కలిగి దేశం&period;&period;అందుకే దీనిని గతంలో బంగారు పక్షి అని పిలిచేవారు&period; కానీ&comma; ఏళ్ల తరబడి పరాయి పాలనలో ఉండటం వల్ల మన దేశ సంపద ఎక్కువ భాగం దోపిడీకి గురైందని చెబుతారు&period; అయినప్పటికీ భారతదేశం ఇప్పటికీ బలంమైన దేశంగానే ఉంది&period; దేశంలో చాలా ప్రాంతాల్లో నిధి నిక్షేపాలు దాగివున్నాయని పరిశోధకులు చెబుతున్నారు&period; అవన్నీ నేటికి అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయని చెబుతున్నారు&period; అలాంటి నిధి ఉన్న ప్రాంతం బీహార్‌లో కూడా ఉంది&period; బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న సోన్ భండార్ గుహలో వేల సంవత్సరాల నాటి స్వర్ణబండాగారం దాగి ఉందని చెబుతున్నారు&period; ఈ నిధి మగధ చక్రవర్తి బింబిసారుడికి చెందినదని పురాణాలు చెబుతున్నాయి&period; దీనిని బ్రిటిష్ వారు కూడా గుర్తించలేకపోయారట&period; పూర్తి వివరాల్లోకి వెళితే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్‌గిర్ చరిత్ర చాలా పురాతనమైనది&period; సోన్‌ భండార్‌ గుహలో ఉన్న నిధి మగధ చక్రవర్తి బింబిసారుడికి చెందినదని&comma; అతడు తన భార్య సలహా మేరకు బంగారాన్ని అక్కడ గుహలో దాచిపెట్టాడని చరిత్రకారులు చెబుతున్నారు&period; బింబిసారుడికి బంగారం&comma; ఆభరణాలంటే చాలా ఇష్టం&period; అతని కుమారుడు అజాతశత్రువు అతన్ని బంధించినప్పుడు&comma; అతని భార్య ఈ గుహలో నిధినంతా దాచిపెట్టరట&period; అది నేటికీ రహస్యంగానే ఉందని చెబుతారు&period; ఈ గుహ రహస్యం బింబిసారుడికి మాత్రమే తెలుసు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82765 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;bimbisara&period;jpg" alt&equals;"bimbisara cave where he stored all of his gold " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ గుహ లోపల ఒక చిన్న గది ఉందని&comma; అందులో సైనికులు నివసించేవారని చెబుతారు&period; ఆ గది వెనుక భాగంలో బింబిసారుడు దాచిన నిధి గది ఉంటుందట&period;&period; అది నేటికీ ఒక భారీ రాయితో మూసివేయబడి ఉంటుందట&period; ఆ రాయిపై శంఖ లిపిలో ఏదో రాసి ఉంది&period; దానిని చదవగలిగినవాడు మాత్రమే ఆ నిధిని చేరుకోగలడని నమ్ముతారు&period; కానీ ఇప్పటివరకు ఎవరూ ఇందులో విజయం సాధించలేదు&period; బ్రిటిష్ వారు ఫిరంగులతో గుహను పేల్చివేయడానికి ప్రయత్నించారు&period; కానీ గుహలోనికి వెళ్లలేకపోయారు&period; నేటికీ గుహపై ఫిరంగి గుర్తులు ఉన్నాయని అక్కడి వెళ్లినవారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోన్‌ భండార్ కు సంబంధించి మహాభారత కాలం నాటి కథలు కూడా ఉన్నాయి&period; వాయు పురాణంలో కూడా జరాసంధుడు ఇక్కడ నిధిని దాచిపెట్టాడని పేర్కొన్నారు&period; జరాసంధుని వధ అనంతరం అతని సంపదనంతా అక్కడి గుహలోనే దాచిపెట్టారని చెబుతారు&period; నేటి వరకు ఎవరూ ఈ నిధిని చేరుకోలేకపోయారు&period; ఈ గుహకు సంబంధిచి అనేక కథలు ప్రచారంలో ఉండటంతో రాజ్‌గిర్‌కు వచ్చే ప్రజలు&comma; పర్యాటకులు ఖచ్చితంగా ఈ మర్మమైన గుహను సందర్శిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts