Garuda Puaranam : మనం ఏది చేస్తే, అదే మళ్ళీ వెనకాల వస్తూ ఉంటుంది. మంచి వాటిని పాటిస్తే, మంచి కలుగుతుంది. కొన్ని పనులు చేస్తే, దురదృష్టం కలుగుతుందని గరుడ పురాణం చెప్తోంది. ఎవరైనా చనిపోతే చనిపోయిన తర్వాత, గరుడ పురాణాన్ని పఠించడం వలన ఆ ఆత్మకి శాంతి కలుగుతుంది అని అంటారు పెద్దలు. వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు గరుడ పురాణంలో చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో చేసే ఈ తప్పులు అదృష్టాన్ని తొలగించేసి, దురదృష్టాన్ని కలిగిస్తాయట.
డబ్బు గురించి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి గర్వపడకూడదని, గరుడ పురాణంలో చెప్పబడింది. అటువంటి ప్రవర్తన మూర్ఖత్వాన్ని తెలుపుతుంది. దీంతో ఇతరులను అవమానిస్తూ ఉంటారు. ఏ వ్యక్తిని కించపరచడం, అవమానించడం మంచిది కాదని పాపమని గరుడ పురాణం చెప్తోంది. లక్ష్మీదేవికి వారిపై ఆగ్రహం కలుగుతుందట. గరుడ పురాణం ప్రకారం, కొందరు దురాశతో ఉంటారు. అలాంటి వారికి మంచి జరగదని గరుడ పురాణం చెప్తోంది.
ఎవరినైనా అవమానించడం, కించపరచడం మహా పాపమని గరుడ పురాణం చెప్తోంది. ఇతరులను కించపరిచే వారు, ఎప్పుడూ సంతోషంగా ఉండలేరని గరుడ పురాణంలో చెప్పబడింది. మాసిన బట్టలు అస్సలు వేసుకోకూడదు. గరుడ పురాణం ప్రకారం, శుభ్రమైన బట్టలే వేసుకోవాలి. మురికి లేదా మాసిపోయిన బట్టలు వేసుకుంటే, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పేదరికం కలుగుతుంది.
కాబట్టి, ఎప్పుడు శుభ్రమైన బట్టలు మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం రాత్రిళ్ళు పెరుగు తినకూడదు. ఇది కూడా చాలా పెద్ద తప్పు అని గరుడ పురాణం ప్రకారం చెప్పబడింది. కాబట్టి, ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులను చేయకూడదు. ఇటువంటి తప్పులు చేస్తే, సుఖంగా ఉండలేరు. కాబట్టి ఎప్పుడూ కూడా గరుడ పురాణంలో చెప్పబడిన ఈ తప్పులను చేయొద్దు. దాని వలన మీకే నష్టం కలుగుతుంది. సమస్యల్ని ఎదుర్కోవాలి.