Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

పాండవులు ల‌క్క ఇంటి నుంచి క్షేమంగా ఎలా త‌ప్పించుకున్నారో తెలుసా..?

Admin by Admin
March 11, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుడి వద్ద సకల విద్యలను నేర్చుకుంటాడు. అదే సమయంలో పాండవుల ప్రతిభ ముందు కౌరవులు సాటిరాలేకపోతారు. దీంతో కౌరవులకు కడుపుమంటగా ఉంటుంది. ధర్మరాజు ప్రజల అనురాగాన్ని చూరగొంటాడు. దీంతో ధుర్యోధనుడికి, ధ్రుతరాష్ర్టుడికి అసూయ పెరుగుతుంది.దీంతో వారిరువురు కలిసి పాండవుల అంతానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. వారణావతం వెళ్లటానికి ధ్రుతరాష్ర్టుడు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. పాండవులను కొన్ని రోజులపాటు వారణావతంలో నూతనంగా నిర్మించిన లక్క ఇంట్లో ఉండమని పంపిస్తాడు. అక్కడ పాండవులను అంతమొందించాలని ధుర్యోధనుడు పురోచనుడనే మంత్రితో పన్నాగం పన్నుతాడు. వారణావతంలో సకల సౌకర్యాలు ఉన్న రాజభవనాన్ని నిర్మిస్తారు.

ఆ భవనం నేతిలో కలిపిన లక్క, గుగ్గిలం, మైనం మున్నగు వాటితో నిర్మిస్తారు. నిప్పురవ్వ తగిలినా బూడిదై పోయ్యేలా నిర్మిస్తారు. హస్తినాపురం నుంచి పాండవులు లక్క‌ ఇల్లు దగ్గరికి చేరుకుంటారు. వారికి కుట్ర గురించి తెలియదు. కానీ వారు బయలు దేరే సమయంలో విదురుడు కొద్ది దూరం సాగనంపడానికి వచ్చి ద్వంద్వార్థంలో మాటల‌ను ధర్మరాజుకు చెప్తాడు. కొంతదూరం ప్రయాణం తర్వాత కుంతీదేవి నాయనా! ధర్మరాజా విదురుని మాటల్లో ఏదో రహస్యం ఉందనిపిస్తుంది అంటుంది. ఏమా రహస్యం అని అడుగుతుంది. అమ్మా మనం నివసించబోయే భవనం కాలిపోతుందనీ, ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి సొరంగం త్రవ్వుకోవాలని అర్థం అని చెప్తాడు.

how pandavas escaped from lakka illu

పాండవులు వారణావతం చేరుకున్నారు. వారికోసం నిర్మించిన శివభవనంలో పాండవులు ప్రవేశించారు. భవనమంతా కలియజూసిన ధర్మరాజు భీమునితో ఈ భవనమంతా నేయి వాసనలు వెదజల్లుతున్నది. ఇదొక మాయా ఇల్లులాగా ఉంది. కొన్నిరోజుల తర్వాత సొరంగాలు తవ్వడంలో నిపుణుడైన ఖనకుడనే వాన్ని విదురుడు పాండవుల వద్దకు పంపిస్తాడు. ఖనకుడి సాహయంతో పాండవులు సొరంగం తవ్వుకుని అవతలి వైపు గంగానది తీరానికి చేరుకుంటారు. సొరంగంలోకి పోయే ముందు లక్క‌ ఇంటికి భీముడు నిప్పు పెడుతాడు. దాంతో అది అంతా బూడిదై పోతుంది. కౌరవులకు లక్క ఇల్లు తగలబడిందని తెలిసి సంబురాలు చేసుకుంటారు. కానీ వారంతా సొరంగం గుండా అడవిలో దూరంగా వెళ్లిపోయారన్న విషయం కేవలం విదురుడికి మాత్రమే తెలుసు.

పాండవులు బూడిదైపోయారన్న వార్తతో భీష్మద్రోణులు చాలా బాధపడ్డారు. ఈ సమయంలో విదురుడు భీష్ముడికి పాండవులు మరణించలేదని అసలు కథ చెప్తాడు. ఇప్పుడు తెలిసింది కదా.. లక్క ఇల్లు తగలబడ్డా పాండవులు క్షేమంగా ఉండటానికి ప్రణాళిక వేసింది కౌరవుల మరో మంత్రి విదురుడు అని. అంటే పాండవుల ప్రాణదాత విదురుడు.

Tags: lakka illupandavas
Previous Post

క‌ల‌శాన్ని ఎందుకు పూజించాలో తెలుసా..?

Next Post

క్యాబేజీతో క్యాన్సర్‌కు బై…బై…!

Related Posts

వినోదం

సూప‌ర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఎంత న‌ష్ట‌పోయారో తెలుసా..?

May 9, 2025
politics

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

May 9, 2025
inspiration

జీవితంపై విర‌క్తి క‌లిగిన ఓ అమ్మాయికి త‌న తండ్రి చెప్పిన మాట‌లు.. ఆలోచించాల్సిందే..

May 9, 2025
హెల్త్ టిప్స్

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

May 8, 2025
చిట్కాలు

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

May 8, 2025
mythology

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు… ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

May 8, 2025

POPULAR POSTS

న‌ట్స్ & సీడ్స్

Chia Seeds In Telugu : చియా విత్త‌నాల‌కు చెందిన ఆరోగ్య ర‌హ‌స్యాలు..!

by Admin
July 23, 2024

...

Read more
కూర‌గాయ‌లు

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by D
March 22, 2023

...

Read more
ఆధ్యాత్మికం

Pichukalu : పిచ్చుక‌లు ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

by D
November 7, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Filter Coffee : హోట‌ల్స్ లో ల‌భించే ఫిల్ట‌ర్ కాఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

by D
May 21, 2023

...

Read more
politics

నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?

by Admin
May 8, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.