mythology

శ్రీ‌రాముడి కంటే కూడా రామ‌నామం గొప్ప‌ద‌ని అంటారు.. ఎందుక‌ని..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సకల లోకంలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు&period; రాముడు గొప్పవాడా&quest; రామ నామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి&period; లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారథిని నిర్మిస్తూ ఉంది&period; రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది&period; ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా&comma; నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది&period; దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు&period; ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది&period; అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే వున్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు &period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకు రామ అనే నామం రాసిన రాళ్ళే పైకితేలుతాయి&period; మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా&excl; అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్పాడు&period; అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైందో కదా&excl; రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక&comma; అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు&period; మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు&period; కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు&comma; నమస్కరించలేదు&period; దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామా &excl; నీ సేవకుడు నన్ను అవమానించాడు&period; నీవు అతడిని శిక్షించు అని రాముడిని ఆదేశించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91909 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-sri-rama-2&period;jpg" alt&equals;"lord sri rama name is great than rama know how " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు&period; ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామ నామాన్ని జపించడం మొదలుపెట్టాడు&period; ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు&period; రామ నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి&period; అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు&period; ఈలోగా నారదమహర్షి అక్కడకు చేరుకుని మహర్షీ&excl; హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా&quest; రామ నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది&period; ఇప్పటికైనా మీ ఆవేశాన్ని&comma; కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు&period; దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయింది&period; యుగయుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం రామనామం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts