గరుడ పురాణం మన మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మ ఎటు వెళుతుంది అనేది క్లియర్‌గా తెలియజేస్తుంది.హిందూ మతానికి సంబంధించి గరుడ పురాణం ప్రత్యేకమైన గ్రంథం. ఇది విష్ణువు భక్తి, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మరణం, దాని అనంతర పరిణామాల గురించి వివరిస్తుంది. ఒక వ్యక్తి చేసే వివిధ పనులకు ఎలాంటి శిక్షణ విధించాలో కూడా గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణాన్ని సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని దహన సంస్కారాల తర్వాత 13 రోజుల పాటు పఠిస్తారు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎవరైనా చనిపోయిన తర్వాత మళ్లీ జన్మిస్తే.. ఆత్మ ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని రోజుల తర్వాత పునరజన్మ పొందుతుంది?
గరుడ పురాణం దాదాపు 84 లక్షల జాతుల గురించి చెబుతుంది. ఇందులో కీటకాలు, జంతువులు, పక్షులు, చెట్లు, మానవులు మొదలైన జాతులు ఉన్నాయి. ఈ గ్రంథం ప్రకారం.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. అయితే ఆకలి, దాహం, కోపం, ద్వేషం, కామం వంటి భావోద్వేగాలు దానికి ఉంటాయి. కఠోపనిషత్తు నుంచి గరుడ పురాణం వరకు మరణం తర్వాతా మానవుడు పశ్చాత్తాపం చెందుతారు. అనంతరం ప్రేత లోకానికి వెళ్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇచ్చిన పిండదానాన్ని తింటారు. వారిచ్చిన నీటిని మాత్రమే తాగుతారు. 13 రోజుల పాటు ఆచారాలతో ముడిపడి ఉన్న అంత్యక్రియల తర్వాత ఆత్మ బొటనవేలు లాంటి సూక్ష్మ శరీరాన్ని పొందుతారు. మరణించిన వ్యక్తి మానవ జీవితంలో చేసిన కర్మ ఫలాలను ఆస్వాదింస్తుంది. అదే శరీరంగా భావిస్తారు.
ఈ బొటన వేలు మాదిరిగానే యమధూతలు 13వ రోజున శరీరాన్ని యమలోకానికి తీసుకువెళ్తారు. యమ మార్గం బహు కష్టతరంగా ఉంటుంది. ఇక్కడే వ్యక్తి తన కర్మ ఫలాలను పొందుతారు. 12 నెలల్లో 16 నగరాలు, నరకాలను దాటి యమలోకానికి చేరుకుంటుంది. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ ఇంటి సభ్యులు దుఃఖంలో మునిగిపోతారు. గరుడ పురాణం వినడం వల్ల ఈ విషాదాన్ని భరించే శక్తి వారికి లభిస్తుంది. వ్యక్తి మరణించిన తరువాత, వారి ఆత్మ 13 నుంచి 14 రోజుల పాటు అదే ఇంట్లో ఉండి, గరుడ పురాణం పారాయణం వింటుందని చెబుతారు. చనిపోయిన వ్యక్తికి మోక్షాన్ని ఇవ్వడానికి ఇలా చేస్తారు.