Aadavallu Meeku Johaarlu : ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Aadavallu Meeku Johaarlu : శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అయిన‌ప్ప‌టికీ అదే పాత క‌థ‌, డైలాగ్స్‌, కామెడీ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చ‌లేదు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ కాక‌పోయినా.. యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుందిం. ఇక ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.

Aadavallu Meeku Johaarlu movie to stream on OTT
Aadavallu Meeku Johaarlu

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాకు గాను డిజిట‌ల్ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ సొంతం చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 1వ తేదీ త‌రువాత ఈ సినిమా ఆ ఓటీటీ యాప్‌లో స్ట్రీమ్ అవుతుంద‌ని స‌మాచారం. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌టన రావ‌ల్సి ఉంది.

మ‌రోవైపు ఈ నెల‌లో రాధేశ్యామ్‌, ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. క‌నుక అప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా కొన‌సాగే అవ‌కాశం లేదు. క‌నుక ఏప్రిల్ మొద‌టి వారంలో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీ ఓటీటీలోకి వస్తుంద‌ని అంటున్నారు. దీనిపై అధికారికంగా త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

Editor

Recent Posts