Actress Pragathi : తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక పాత్రల్లో నటించి.. నటి ప్రగతి ఎంతో పేరు తెచ్చుకుంది. తల్లి, అక్క.. లాంటి పాత్రల్లో ఈమె నటిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈమె నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. పలు పాటలకు చెందిన డ్యాన్స్ వీడియోలతో ఈమె అలరిస్తుంటుంది. సినిమా పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటుంది.
ఇక తాజాగా హోలీ పండుగ సందర్బంగా నటి ప్రగతి కొందరితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. హోలీ రంగులు పూర్తిగా చల్లుకుని ఆ ఊపులో ఈమె డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది. చూస్తుంటే ప్రగతి హోలీ వేడుకల్లో పూర్తిగా నిమగ్నమైనట్లు అర్థమవుతోంది.
ఇక ప్రగతి చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె డ్యాన్స్‌కు అందరూ షాకవుతున్నారు. సినిమాల్లో ఎంతో డీసెంట్ పాత్రలు చేసే ఈమె బయట మాత్రం ఇంతలా రెచ్చిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.