Aishwarya Rajinikanth : ధ‌నుష్ కు షాకిచ్చిన ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌.. ఆ విధంగా చేసింది..!

Aishwarya Rajinikanth : త‌మిళ స్టార్ న‌టుడు ధ‌నుష్.. త‌న భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌కు విడాకులు ఇచ్చిన విష‌యం విదిత‌మే. జ‌న‌వ‌రి 17వ తేదీన వీరు త‌మ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ ఒక్క‌సారిగా షాక‌య్యారు. ఇన్ని సంవ‌త్స‌రాల పాటు అన్యోన్యంగా ఉండి.. ఇప్పుడు ఇంత స‌డెన్‌గా వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారో.. చాలా మందికి అర్థం కావ‌డం లేదు. ఇక వీరిని క‌లిపేందుకు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా బాగానే ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది. కానీ చివ‌ర‌కు వీరు విడిపోవాల‌నే నిర్ణ‌యించుకున్నారు. దీంతో వీరు విడిపోయి వేర్వేరుగా జీవితాల‌ను కొన‌సాగిస్తున్నారు.

 Aishwarya Rajinikanth removed her husband Dhanush name from her social accounts
Aishwarya Rajinikanth

ఇక ఈ మ‌ధ్య వీరి కామ‌న్ ఫ్రెండ్స్ కొంద‌రు పార్టీలు ఇవ్వ‌గా.. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌లు హాజ‌ర‌య్యారు. కానీ ఎదురు ప‌డి కూడా ప‌ల‌క‌రించుకోలేద‌ని వార్త‌లు వచ్చాయి. త‌రువాత ఐశ్వ‌ర్య చేసిన ఓ మ్యూజిక్ వీడియోను మెచ్చుకుంటూ ధ‌నుష్ ట్విట్ట‌ర్‌లో కంగ్రాట్స్ తెలిపారు. దీనికి ఐశ్వ‌ర్య కూడా థాంక్ యూ అని చెప్పింది. అయితే సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ప్ప వీరి మ‌ధ్య మాట‌లు లేవ‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్.. ధ‌నుష్‌కు షాకిచ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ ఖాతాల్లో త‌న భ‌ర్త ధ‌నుష్ పేరును ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని తొలగించింది. త‌న భ‌ర్త పేరును తొల‌గిస్తూ ఆ ఖాతాల్లో పేర్ల‌ను మార్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో @ash_r_dhanush అని ఉండ‌గా.. దాన్ని aishwaryarajini గా మార్చింది. అలాగే ట్విట్ట‌ర్‌లో Aishwarya Rajinikanth గా పేరును మార్చేసింది. దీంతో ఈ వార్త వైర‌ల్ అవుతోంది. అయితే గ‌తంలో స‌మంత మాత్రం విడాకుల‌కు ముందే త‌న పేరులోంచి అక్కినేని తొల‌గించింది. దీంతో స‌మంత‌, చైత‌న్య విడాకులు తీసుకోబోతున్నార‌ని తెలిసింది. చివ‌ర‌కు అదే నిజ‌మైంది. కానీ ఇప్పుడు ఐశ్వ‌ర్య మాత్రం ధ‌నుష్‌కు విడాకులు ఇచ్చాకే త‌న పేరు చివ‌ర్లో ఆయ‌న పేరును తీసేసింది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఈ టాపిక్‌పై కూడా చ‌ర్చించుకుంటున్నారు.

ఇక ఐశ్వ‌ర్య ఈ మ‌ధ్యే ఓ హిందీ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించ‌బోతున్న‌ట్లు చెప్ప‌గా.. ధ‌నుష్ ప్ర‌స్తుతం సర్ అనే తెలుగు సినిమాలో న‌టిస్తున్నాడు. ఈయ‌న న‌టించిన మార‌న్ అనే మూవీ ఈ మ‌ధ్యే అమెజాన్‌లో నేరుగా రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది.

Editor

Recent Posts