Alasanda Ginjala Kura : అల‌సంద‌ గింజ‌ల‌తో కూర‌.. క‌మ్మ‌ని రుచి.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Alasanda Ginjala Kura : బీన్స్ జాతికి చెందిన కాయ‌ల‌లో అల‌సంద కూడా ఒక‌టి. ఇంగ్లీష్ లో వీటిని లాంగ్ బీన్స్ అని పిలుస్తారు. చాలామంది సాధార‌ణంగా అల‌సంద‌ల గింజ‌ల‌ను వేపుడు లా గానీ లేదా ట‌మాట‌తో క‌లిపి గానీ వండుతూ ఉంటారు. ఎక్కువ మందికి ఇలా తిన‌డం ఇష్టం లేక‌పోవ‌డం మ‌నం చూస్తూ ఉంటాం. అయితే అల‌సంద గింజ‌ల‌తో కొంచెం కొత్త‌గా క‌ర్రీ లా కూడా చేసుకోవ‌చ్చు. ఇది చ‌పాతి తో పాటు అన్నం లోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు అలంసంద గింజ‌ల‌తో క‌ర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

అల‌సంద గింజ‌ల‌తో క‌ర్రీకి కావాల్సిన ప‌దార్థాలు..

అల‌సంద‌లు – ఒక క‌ప్పు, ఉల్లిపాయ – ఒక‌టి, ట‌మాట‌- ఒక‌టి, ఆవాలు – 1 స్పూన్, క‌రివేపాకు – కొద్దిగా, ప‌సుపు- పావు స్పూన్, నూనె – 2 స్పూన్లు.

మ‌సాలా పొడి కోసం కావాల్సిన ప‌దార్థాలు..

కొబ్బ‌రి తురుము – అర‌క‌ప్పు, నాన‌బెట్టిన బియ్యం – 1 స్పూన్, ధ‌నియాలు – ఒక‌టిన్న‌ర స్పూన్ , జీల‌క‌ర్ర – 1 స్పూన్, ఎండుమిర్చి- 5, చింత‌పండు గుజ్జు- 1 స్పూన్, బెల్లం – కొద్దిగా, ఉప్పు – త‌గినంత.

Alasanda Ginjala Kura wonderful taste know how to make
Alasanda Ginjala Kura

అల‌సంద క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా అల‌సంద‌ల‌ను 2 నుండి 3 గంట‌లు నాన‌బెట్టాలి, త‌రువాత వాటిని కుక్క‌ర్ లో ఉడికించుకొని ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ మీద క‌ళాయి పెట్టుకొని నూనె వేసి అది వేడెక్కిన త‌రువాత అందులో ఆవాలు వేసి వేయించుకోవాలి. త‌రువాత ఆ నూనెలో ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, క‌రివేపాకు, ప‌సుపు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌ర‌కు క‌ళాయిపై మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ లోపు మ‌సాల‌కోసం తీసుకున్న ప‌దార్థాల‌ను మిక్సీలో వేసుకొని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలోని ట‌మాటాలు మెత్త‌గా అయిన త‌రువాత దానికి గ్రైండ్ చేసుకున్న మ‌సాల మిశ్ర‌మాన్ని క‌లుపుకోవాలి. దీనికి త‌గినంత ఉప్పును వేసి కూర‌ను ఉడికించుకోవాలి. క‌ర్రీ ద‌గ్గ‌రగా అవుతున్న‌ప్పుడు స్టౌవ్ మీద నుండి దించుకోవాలి. దీంతో అల‌సంద క‌ర్రీ త‌యారు అయిపోయిన‌ట్లే.

Prathap

Recent Posts