All In One Chicken Curry : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, పూరీ, బగారా అన్నం ఇలా దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో ఈ కర్రీ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎక్కువ గ్రేవీతో ఎందులోకైనా తినే ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 4, బిర్యానీ ఆకు – 1, జాపత్రి – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – 2 రెమ్మలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3, చిన్నగా తరిగిన టమాట- 1, ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, జీడిపప్పు – 10 నుండి 15, నీళ్లు – ఒక గ్లాస్, గరం మసాలా – అర టీ స్పూన్, కసూరిమెంతి – అర టీ స్పూన్.
చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత ఈ చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత జీడిపప్పును పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడిచేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై చికెన్ లోని నీరు అంతా పోయి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ ఉడికి నూనె పైకి తేలిన తరువాత గరం మసాలా, కసూరిమెంతి వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ తయారవుతుంది. ఈ చికెన్ కర్రీని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.