Allu Arjun Fitness Secrets : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. అతని నటనకు ప్రేక్షకుల్లో ఉన్న ఆధరణ అంతా ఇంతా కాదు. అతని డ్యాన్స్, నటన నైపుణ్యం అతన్ని ఎంతో పేరుగాంచేలా చేసాయని చెప్పవచ్చు. అల్లు అర్జున్ కేవలం నటనకే కాదు అతని ఫిట్ నెస్ కు కూడా ఎంతో ప్రసిద్ది అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ ఫిట్ నెస్ రోటీన్ మరియు డైట్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అల్లు అర్జున్ అంత ఫిట్ గా ఉండాలని కోరుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. అల్లు అర్జున్ పాటించే ఫిట్ నెస్ రహస్యాలు మరియు అతను పాటించే కొన్ని డైట్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ జిమ్ కు వెళ్లే ముందు రోజూ 45 నిమిషాల పాటు రన్నింగ్ చేస్తాడు. ఫాస్ట్ రన్నింగ్ తోనే అతని రోజును ప్రారంభిస్తాడు.
అలాగే రోజూ సైక్లింగ్ చేస్తాడు. ఇది శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడంతో పాటు కాళ్లకు మరియు మోకాళ్లకు ఒక వ్యాయామంగా భావిస్తాడు. అలాగే అతని జిమ్ వర్కౌట్ లో ఎక్కువగా పుష్ అప్స్, డిప్స్, స్క్వాట్స్, పుల్ అప్స్, క్రంచెస్ ఉంటాయి. రోజూ 2 గంటలు జిమ్ లోనే ఉంటాడు. అలాగే షూటింగ్ సమయాల్లో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన గింజలను,నట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు. ఇవి శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే శరీరం హైడ్రేటెడ్ గా ఉండడానికి గానై కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉంటాడు. అలాగే ఉదయం పూట అల్పాహారంగా తృణ ధాన్యాలను, తాజా పండ్లను, కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు. అలాగే అల్లు అర్జున్ మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్, పప్పు, ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు.
అలాగే పక్కన ప్రోటీన్ షేక్ లేదా ఫ్రూట్ షేక్ కూడా ఉంటుంది. అలాగే రాత్రి భోజనంలో బ్రౌన్ రైస్ సలాడ్, గ్రీన్ బీన్స్, ఉడికించిన కూరగాయలను తీసుకుంటూ ఉంటాడు. ఇలా అల్లు అర్జున్ డైట్, వ్యాయామాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇవన్నీ పాటించడం వల్లే అతను అంత ఫిట్ గా ఉన్నాడని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ లో కనిపించనున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ ఎంతటి ప్రజాధరణ పొందిందో మనందరికి తెలిసిందే.