Aloo Mudda Kura : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బంగాళాదుంప ఒకటి. బంగాళాదుంప మన ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. బంగాళాదుంపలతో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంపలను ఇష్టంగా తింటారు. కింద చెప్పిన విధంగా చేసే బంగాళాదుంప కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో అయ్యే ఈ బంగాళాదుంప కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – పావు కిలో, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు గింజలు – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత క్యాప్సికం ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత కళాయిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత అందులో కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకుని కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత గరం మసాలా వేసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప కూర తయారవుతుంది. దీనిని వేడిగా ఉన్నప్పుడే అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో ఈ విధంగా చేసిన కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ చేసే బంగాళాదుంప కూరతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.