Ananya Panday : అన‌న్య పాండే.. ఏంటిది ? లైగ‌ర్ బ్యూటీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..!

Ananya Panday : పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం.. లైగ‌ర్‌. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈమె ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. అందుకు కార‌ణం ఈమె చేసే గ్లామ‌ర్ షోనే అని చెప్ప‌వ‌చ్చు. ఇక తాజాగా మ‌రోమారు ఈమె వార్త‌ల‌కెక్కింది. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఈమె గ్లామ‌ర‌స్ డ్రెస్ వేసుకుని క‌నిపించింది. ఆ డ్రెస్ మామూలుగా లేదు. ఉల్లిపొర లాగా ఉంది. వెనుక మొత్తం క‌నిపిస్తోంది. దీంతో ఆమె డ్రెస్ వీడియో వైర‌ల్ అవుతోంది.

Ananya Panday birth day party video viral
Ananya Panday

అన‌న్య పాండే తాజాగా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సీఈవో అపూర్వ మెహ‌తా బ‌ర్త్ డే పార్టీకి హాజ‌రైంది. ఇందులో లైగ‌ర్ టీమ్ కూడా పాల్గొంది. ఈ క్ర‌మంలోనే పార్టీలో ఈమె విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ముచ్చ‌ట్లు పెట్టింది. అయితే ఈమె ధ‌రించిన డ్రెస్ గురించే ఇప్పుడు చ‌ర్చంతా న‌డుస్తోంది. అందులో ఆమె మ‌రీ అస‌భ్యంగా క‌నిపిస్తుండ‌డం విశేషం.

కాగా ఈ పార్టీని ముంబైలో చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్‌, అన‌న్య పాండే, చార్మి, పూరీ జ‌గ‌న్నాథ్‌లు ఈ పార్టీలో పాల్గొని అల‌రించారు. అయితే అన‌న్య పాండే ధ‌రించిన డ్రెస్ కార‌ణంగా ఆమెను నెటిజ‌న్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈమెను తెగ విమ‌ర్శిస్తున్నారు. బాలీవుడ్ ఐట‌మ్ భామ మ‌లైకా అరోరాను కాపీ కొడుతున్నావా..? ఏంటి..? అంటూ ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అన‌న్య పాండే డ్రెస్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

Share
Editor

Recent Posts