Anda Keema Curry : కోడిగుడ్ల‌తో అండా కీమా క‌ర్రీ.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Anda Keema Curry : కోడిగుడ్లు అంటే మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని కొంద‌రు ఆమ్లెట్‌లా వేసి తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు కూర లేదా ఫ్రై చేసుకుంటారు. ఇంకొంద‌రు బాయిల్డ్ ఎగ్స్ రూపంలో తింటారు. అయితే ఎలా తిన్నా స‌రే కోడిగుడ్ల వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు దాదాపుగా అన్నీ ఉంటాయి. క‌నుక‌నే కోడిగుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా అభివ‌ర్ణిస్తారు. అయితే కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల కూర‌లు చేస్తుంటాం. వాటిల్లో అండా కీమా క‌ర్రీ ఒక‌టి. దీన్ని రుచిగా చేయాలే కానీ ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు. దీన్ని చ‌పాతీలు, రోటీలు, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇక అండా కీమా క‌ర్రీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Anda Keema Curry very tasty make in this method
Anda Keema Curry

అండా కీమా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడిక‌బెట్టిన కోడిగుడ్లు – 3, గుడ్లు – 2, ఉల్లిపాయ – ఒక‌టి, ట‌మాటాలు – 2, కొత్తిమీర – ఒక క‌ట్ట‌, ప‌చ్చి మిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర – ఒక టీస్పూన్‌, ప‌సుపు – పావు టీస్పూన్‌, కారం – 2 టీస్పూన్లు, ధ‌నియాల పొడి – ఒక టీస్పూన్, పావ్ భాజీ మ‌సాలా – ఒక టీస్పూన్‌, చాట్ మ‌సాలా – ఒక టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – మూడు టేబుల్ స్పూన్లు.

అండా కీమా క‌ర్రీని త‌యారు చేసే విధానం..

స్ట‌వ్ మీద క‌ళాయి పెట్టి నూనె వేసి జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ త‌రుగు వేయాలి. అవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర‌, ట‌మాటా ముక్క‌లు, త‌గినంత ఉప్పు వేయాలి. త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, పావ్ భాజీ మ‌సాలా, చాట్ మ‌సాలా వేసి క‌లిపి పావు క‌ప్పు నీళ్లు పోయాలి. ఇది కూర‌లా త‌యారై నూనె పైకి తేలాక ఉడికించిన గుడ్ల‌ను చేత్తో న‌లిపి అందులో వేసి స్ట‌వ్ ని సిమ్ లో పెట్టాలి. ఇప్పుడు మిగిలిన రెండు గుడ్ల సొన‌ను గిల‌కొట్టి కూర‌లో వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత 5, 6 నిమిషాల పాటు ఉడికించాలి. కూర ఉడికిన త‌రువాత దింపేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన అండా కీమా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీన్ని రోటీలు, చ‌పాతీలు, పుల్కాల‌తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Editor

Recent Posts