Apples Buying Tips : యాపిల్ పండ్ల‌ను కొనేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించండి.. లేదంటే ఇబ్బందులు ప‌డ‌తారు..!

Apples Buying Tips : ఆరోగ్యంగా ఉండేందుకు గాను రోజుకో యాపిల్‌ను తినాల‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. కొంద‌రు వీటిని ఉద‌యాన్నే తింటారు. యాపిల్స్‌లో ఫైబ‌ర్‌, విట‌మిన్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాపిల్స్‌ను తిన‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే యాపిల్ పండ్లను సరైన‌వి తింటేనే మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే మ‌నం కొనే యాపిల్ పండ్లు స‌రిగ్గా ఉన్నాయో లేదో ఎలా చెక్ చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు మంచి యాపిల్స్‌ను కొనాల‌నుకుంటే వాటిని కొనే స‌మ‌యంలో అవి చిన్న ప‌రిమాణంలో, సాధార‌ణ బ‌రువు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే యాపిల్ పండ్లు పెద్ద‌గా ఉంటే అవి చెడిపోయేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇక బ‌రువు ఎక్కువ‌గా ఉండే యాపిల్స్ కూడా మంచివి కావు అన్న విష‌యాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

Apples Buying Tips follow these to get better of them
Apples Buying Tips

మ‌న‌కు యాపిల్స్ ఎక్కువ‌గా ఎరుపు, లేత ప‌సుపు, ఆకుప‌చ్చ రంగుల్లో ల‌భిస్తుంటాయి. ఇక చాలా మంది యాపిల్స్ బాగా రెడ్ గా ఉంటే వాటికి అట్రాక్ట్ అయి వాటిని కొంటుంటారు. కానీ లేత ఎరుపు, ఆకుప‌చ్చ‌, మిక్డ్స్ క‌ల‌ర్ యాపిల్స్ రెడ్ క‌ల‌ర్ యాపిల్స్ కంటే తియ్య‌గా, రుచిగా ఉంటాయి. ఆకుప‌చ్చ యాపిల్స్ ప‌చ్చిగా ఉంటాయి. అవి కాస్త పుల్ల‌గా ఉంటాయి. ప‌సుపు రంగులో ఉండేవి తియ్య‌గా ఉంటాయి. జ్యూస్ త‌యారీకి బాగుంటాయి.

వాస‌న చూసి కూడా యాపిల్స్ బాగున్నాయో లేదో చెప్ప‌వచ్చు. స్వీట్ యాపిల్ అయితే మంచి సువాస‌న వ‌స్తుంది. వాసన రావ‌డం లేదంటే యాపిల్స్‌ను కొన‌కూడ‌దు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో యాపిల్స్ వాస‌న చూడ‌డం క‌ష్ట‌మే అవుతుంది. ఇక యాపిల్ పండ్ల‌ను తాకి కూడా అవి బాగున్నాయో లేదో చెప్ప‌వ‌చ్చు. యాపిల్ పండ్ల‌ను తాకిన‌ప్పుడు వాటిపై గీత‌లు లేదా చార‌లు ప‌డినా, లేదా మ‌చ్చ‌లు ప‌డినా కూడా అలాంటి యాపిల్స్ పాడైపోయాయ‌ని నిర్దారించుకోవాలి. అలాంటి యాపిల్స్‌ను అస‌లు కొనుగోలు చేయ‌కూడ‌దు. ఇలా యాపిల్స్‌ను కొనేట‌ప్పుడు జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే యాపిల్ పండ్ల‌ను కొన్నాక మీరే ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది.

Editor

Recent Posts