Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Bagara Rice Aloo Curry : బ‌గారా అన్నంలోకి ఆలు కూర‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోవాలంతే..!

D by D
November 26, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Bagara Rice Aloo Curry : బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌తో చేసే ప్ర‌తికూర కూడా చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీలోకి, పులావ్ లోకి, బ‌గారా అన్నంలోకి ర‌క‌ర‌కాలుగా బంగాళాదుంప‌ల‌తో వంట‌లు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ బంగాళాదుంప‌ల‌తో బ‌గారా అన్నంలోకి రుచిగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బ‌గారా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – పావు కిలో, త‌రిగిన పెద్ద ఉల్ల‌పాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బ‌రి పొడి – 2 టేబుల్ స్పూన్స్, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయ ప‌రిమాణమంతా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Bagara Rice Aloo Curry recipe in telugu perfect method
Bagara Rice Aloo Curry

మ‌సాలా దినుసులు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 3, ల‌వంగాలు – 4, సాజీరా – ఒక టీ స్పూన్.

ఆలూ బ‌గారా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌ల్లీలు, మ‌సాలా దినుసులు, నువ్వులు వేసి దోర‌గా వేయించాలి.. త‌రువాత గ‌స‌గ‌సాలు, ఎండుకొబ్బ‌రి పొడి వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత అర గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు, చింత‌పండు ర‌సం, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బ‌గారా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని బ‌గారా అన్నం, చ‌పాతీ, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే బంగాళాదుంప కూర కంటే ఈ విధంగా చేసిన ఆలూ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది.

Tags: Bagara Rice Aloo Currycurriesvegetarian foods
Previous Post

Apples : ఒక్కో యాపిల్లో ఎన్ని క్యాల‌రీలు ఉంటాయి.. యాపిల్ పండ్ల‌ను ఫ్రిజ్‌లోనే ఎందుకు పెట్టాలి.. ఇంకా ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు..

Next Post

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు తిన‌వ‌చ్చా.. బాదం, జీడిప‌ప్పు, కిస్మిస్‌, ఖర్జూరాల‌ను తిన‌కూడ‌దా..?

Related Posts

హెల్త్ టిప్స్

నిద్ర లేచిన‌ వెంట‌నే త‌ల‌నొప్పిగా ఉంటుందా.. అయితే ఇలా చేయండి..

June 9, 2025
హెల్త్ టిప్స్

బ‌ల‌మైన కండ‌లు కావాలంటే ఈ ఆహారాల‌ను తినండి

June 9, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ్యాధిని వెన‌క్కి మ‌ళ్లించ‌వ‌చ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?

June 9, 2025
వైద్య విజ్ఞానం

ఎలాంటి దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏ ర‌కం టూత్ పేస్ట్‌ను వాడాలో తెలుసా..?

June 9, 2025
ఆధ్యాత్మికం

తలకిందులు భంగిమలో ఉన్న శివుడు గురించి మీకు తెలుసా? ఇలా ఎందుకున్నాడంటే…?

June 9, 2025
technology

ప్రతి వాట్సాప్ గ్రూప్ లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!