Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Beerakaya Tomato Pachadi : క్యాట‌రింగ్ స్టైల్‌లో బీర‌కాయ‌, ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

D by D
July 4, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Beerakaya Tomato Pachadi : బీర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బీరకాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బీర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని ట‌మాటాలు వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ వాళ్లు బీర‌కాయ ప‌చ్చ‌డిని ఎక్కువ‌గా ఇలాగే త‌యారు చేస్తూ ఉంటారు. క్యాట‌రింగ్ స్టైల్ లో బీరకాయ ప‌చ్చ‌డిని మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీర‌కాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బీరకాయ – ఒక‌టి ( పెద్ద‌ది), త‌రిగిన ట‌మాటాలు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు -ఒక టేబుల్ స్పూన్, మిన‌ప‌ప్పు -ఒక టేబుల్ స్పూన్, జీలక‌ర్ర – అర టీ స్పూన్, ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు -ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చిమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, ఉప్పు -త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, చింత‌పండు – ఒక రెమ్మ‌.

Beerakaya Tomato Pachadi recipe in telugu make in this way
Beerakaya Tomato Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఇంగువ – కొద్దిగా.

బీర‌కాయ ట‌మాట ప‌చ్చిడి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. తరువాత జీల‌క‌ర్ర‌, ప‌ల్లీలు, ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత నువ్వులు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత బీర‌కాయ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, చింత‌పండు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇవి కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత జార్ లో వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Beerakaya Tomato Pachadi
Previous Post

Nerve Burning : మీ పాదాలు, చేతుల్లో న‌రాల మంట‌లు వ‌స్తున్నాయా.. అయితే నిర్ల‌క్ష్యం చేయ‌కండి..!

Next Post

Cabbage Pachadi : క్యాబేజీతో ఒక్క‌సారి ఇలా ప‌చ్చ‌డి చేసి తిని చూడండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!