Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Bellam Appalu : బెల్లం అప్పాల‌ను ఇలా చేయాలి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

D by D
February 3, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Bellam Appalu : బెల్లం అప్పాలు.. ఈ అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని రుచిచూసే ఉంటారు. అలాగే నైవేద్యంగా కూడా వీటిని స‌మ‌ర్పిస్తూ ఉంటారు. బెల్లం అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పాకం ప‌ట్టే అవ‌స‌రం కూడా ఉండ‌దు. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ బెల్లం అప్పాల‌ను, క‌మ్మ‌గా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం అప్పాల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

గోధుమ‌పిండి – అర క‌ప్పు, బియ్యంపిండి – అర క‌ప్పు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, బెల్లం – ఒక క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Bellam Appalu recipe make like this once for better taste
Bellam Appalu

బెల్లం అప్పాల త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో గోధుమ‌పిండి, బియ్యంపిండి, యాల‌కుల పొడి వేసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో నీళ్లు పోసి వేడిచేయాలి. ఇందులోనే బెల్లం వేసి క‌ల‌పాలి. బెల్లం క‌రిగి ఒక పొంగు వ‌చ్చిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి పిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత చేత్తో ఉండ‌లు లేకుండా బాగా వ‌త్తుకోవాలి. త‌రువాత చేతుల‌కు నెయ్యి రాసుకుంటూ పిండి తీసుకుని అప్పాలుగా వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అప్పాలు వేసి అలాగే ఉంచాలి. రెండు నిమిషాల త‌రువాత అటూ ఇటూ తిప్పుతూ మ‌ధ్య‌స్థ మంట‌పై లైట్ గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మంట‌ను పెద్ద‌గా చేసి గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం అప్పాలు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాలా సుల‌భంగా, రుచిగా బెల్లం అప్పాల‌ను తయారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Bellam Appalu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Kakarakaya Vepudu : చేదు అస్స‌లు లేకుండా కాక‌ర‌కాయ వేపుడు ఇలా చేయండి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.