Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Bendakaya Fry : బెండకాయ ఫ్రై.. ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేయండి.. మీకు చాలా నచ్చుతుంది..

D by D
April 18, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Bendakaya Fry : మ‌నం బెండ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బెండ‌కాయలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. బెండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బెండ‌కాయ వేపుడును ఇష్టంగా తింటారు. ఈ బెండ‌కాయ వేపుడును మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పిండి వేసి చేసే ఈ బెండ‌కాయ వేపుడు చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. మ‌రింత రుచిగా ఈ బెండ‌కాయ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

త‌రిగిన బెండ‌కాయ‌లు – అర కిలో, శ‌న‌గ‌పిండి – పావు క‌ప్పు, నూనె – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, నిమ్మ‌కాయ – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Bendakaya Fry recipe in telugu very tasty how to cook
Bendakaya Fry

బెండ‌కాయ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో శ‌న‌గ‌పిండి వేసి వేయించాలి. దీనిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. శ‌న‌గ‌పిండి చ‌ల్లారిన త‌రువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ కారం, కొద్దిగా ప‌సుపు, పావు టీ స్పూన్ ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి పిండిని ఉండ‌లు లేకుండా క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఇంగువ‌, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించాలి. బెండ‌కాయ ముక్క‌లు గ స‌గం వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి.

ఉల్లిపాయ ముక్క‌లు రంగు మారిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి వేయించాలి. బెండ‌కాయ ముక్కలు పూర్తిగా వేగిన త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి ముందుగా క‌లుపుకున్న శ‌న‌గ‌పిండిని వేసి క‌ల‌పాలి. ఈ ముక్క‌ల‌ను రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం, కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే బెండ‌కాయ ఫ్రై కంటే ఈ విధంగా చేసిన బెండ‌కాయ ఫ్రై మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Bendakaya Fry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Gond Katira : విరిగిన ఎముక‌ల్ని త్వ‌ర‌గా అతికిస్తుంది.. న‌డుము నొప్పి ఉండ‌దు.. దీని గురించి తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.