Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Bendakaya Pachadi : వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి ఈ బెండ‌కాయ ప‌చ్చ‌డి తినండి.. వాహ్వా.. అంటారు..!

D by D
September 25, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Bendakaya Pachadi : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా వేపుడు, పులుసు, కూర‌, డీప్ ఫ్రై వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ చేసే ఈ వంట‌కాల‌తో పాటు బెండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచిచూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే ప‌చ్చ‌డి కావాలంటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ బెండ‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బెండ‌కాయ‌లు – పావుకిలో, త‌రిగిన ట‌మాటాలు – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ధ‌నియాలు- 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ఎండుమిర్చి – 20, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, చింత‌పండు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Bendakaya Pachadi recipe easy to make and tasty
Bendakaya Pachadi

బెండ‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా బెండ‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా కట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మెంతులు, ఆవాలు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు, కొత్తిమీర‌ వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో మ‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు, చింత‌పండు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌ల‌ను బాగావేయించాలి.

ట‌మాట ముక్క‌లు, బెండ‌కాయ ముక్క‌లు పూర్తిగా మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆప్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత జార్ లో ముందుగా వేయించిన ఎండుమిర్చితో పాటు ఇత‌ర దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వేయించిన బెండ‌కాయ ముక్క‌లు వేసి ప‌ల్స్ ఇస్తూ బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ ప‌చ్చ‌డిని తాళింపు చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Bendakaya Pachadi
Previous Post

Health Problems : రోజుకి 8 గంటలు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే 45 ఏళ్ల తర్వాత మీకొచ్చే 10 ప్రమాదాలు ఇవే.!

Next Post

Ayurvedic Remedies For Diabetes : షుగ‌ర్‌ను త‌గ్గించే ఆయుర్వేద చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!