Bendakaya Pachadi : బెండ‌కాయ‌ల‌తో ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది..!

Bendakaya Pachadi : బెండ‌కాయ‌ల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, టమాటా కూర‌, పులుసు వంటివి చేస్తుంటారు. అయితే బెండ‌కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా పెట్టుకోవ‌చ్చు. రొటీన్‌గా బెండ‌కాయ‌ల‌తో కూర‌ల‌ను చేయ‌కుండా ఒక్క‌సారి ఇలా ప‌చ్చ‌డి చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ క్ర‌మంలోనే బెండ‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బెండ‌కాయ‌లు – పావు కిలో (చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి), నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్‌, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, మిన‌ప ప‌ప్పు – 1 టీస్పూన్‌, ఎండు మిర‌ప‌కాయ‌లు – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 2 (స‌న్న‌గా త‌ర‌గాలి), ఉల్లిపాయ – 1 (స‌న్న‌గా త‌ర‌గాలి), చింత పండు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, కారం – 1 టీస్పూన్ (అవ‌స‌రం అనుకుంటే ఇంకా వేసుకోవ‌చ్చు), ఉప్పు – రుచికి త‌గినంత‌, కొత్తిమీర – గార్నిష్ కోసం.

Bendakaya Pachadi recipe in telugu make in this way
Bendakaya Pachadi

బెండ‌కాయ ప‌చ్చ‌డిని త‌యారు చేసే విధానం..

స్ట‌వ్ వెలిగించి పాన్ పెట్టి మంట‌ను మీడియంగా ఉంచి పాన్‌లో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, మిన‌ప ప‌ప్పు, ఎండు మిర‌ప కాయ‌లు వేసి బాగా వేయించాలి. వేగాక స‌న్న‌గా త‌రిగిన వెల్లుల్లి ముక్క‌లు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. వెల్లుల్లి మంచి వాస‌న వ‌స్తుంది. త‌రువాత ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి. అనంత‌రం త‌రిగిన బెండ‌కాయ ముక్క‌ల‌ను వేసి బాగా వేయించాలి. ఈ మిశ్ర‌మాన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో బెండ‌కాయ‌లు మెత్త‌గా మారుతాయి.

త‌రువాత ఇంకో గిన్నె తీసుకుని అందులో చింత‌పండు పేస్ట్‌, కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా క‌లిపి స్మూత్ పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని అంత‌కు ముందు ఉడికించిన బెండ‌కాయ‌ల మిశ్ర‌మంలో వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత స్ట‌వ్‌పై 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో ఫ్లేవ‌ర్స్ బాగా వ‌స్తాయి. అనంత‌రం స్ట‌వ్ ఆఫ్ చేసి మిశ్ర‌మాన్ని చ‌ల్లార్చాలి. త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని మిక్సీలో లేదా రోలులో వేసి మెత్త‌గా ప‌ట్టుకోవాలి. అనంత‌రం కొత్తిమీర ఆకుల‌ను మీద చ‌ల్లి గార్నిష్ చేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ ప‌చ్చ‌డి రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు లేదా ఏదైనా టిఫిన్‌లోనూ తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts