Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగిశాక మళ్లీ బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా.. అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున ఇది వరకే బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇక ఆ తేదీ రానే వచ్చింది. నిర్వాహకులు బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యే తేదీని చెప్పేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ షోను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే కొత్త ప్రోమోను కూడా కాసేపటి క్రితమే విడుదల చేశారు. అందులో నాగార్జునతోపాటు పలువురు నటించారు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగుకు బిగ్ బాస్ నాన్ స్టాప్ అని పేరు పెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ షోను ఈ నెల 26వ తేదీన ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వెన్నెల కిషోర్, నాగార్జున, మురళీ శర్మలు నటించారు. వెన్నెల కిషోర్ ఉరిశిక్ష పడిన ఖైదీగా యాక్ట్ చేయగా.. ఆయన లాయర్‌గా నాగార్జున నటించారు. అలాగే కిషోర్‌కు ఉరి శిక్ష వేసే పోలీస్ అధికారిగా మురళీ శర్మ నటించారు.
ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్‌ను ఉరి తీసేందుకు తీసుకువస్తారు. అయితే ఉరి తీసేముందు చివరి కోరిక అడుగుతారు కదా.. అదే క్రమంలో కిషోర్‌ను కూడా తన చివరి కోరిక ఏమిటని అడుగుతారు. దీంతో బిగ్ బాస్ చూడాలని ఉందని చెప్పమని.. నాగార్జున కిషోర్‌కు హింట్ ఇస్తారు. దీంతో కిషోర్ అదే కోరిక కోరుతాడు. ఈ క్రమంలో కిషోర్ బిగ్ బాస్‌ను ఫోన్‌లో చూస్తూనే ఉంటాడు. అది ఎంతకూ అయిపోదు. దీంతో ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటాడు. ఇలా ప్రోమోను తీశారు.
ఇక ప్రోమో చివర్లో బిగ్ బాస్ ఇది.. నో కామా, నో ఫుల్ స్టాప్.. ఓన్లీ నాన్ స్టాప్.. ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్.. 24 * 7.. అని నాగార్జున చెప్పారు. ఇక ఈ షో ప్రారంభం అయ్యే తేదీ వచ్చేసింది. కానీ కంటెస్టెంట్ల జాబితా విడుదల కాలేదు. ఇందులో ముమైత్ ఖాన్, తేజస్వి మడివాడ, అరియానా, అషు రెడ్డి వంటి పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.