Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Butter Naan : బ‌ట‌ర్ నాన్ ను ఇలా చేస్తే.. రెస్టారెంట్‌లో చేసిన‌ట్లు వ‌స్తుంది.. చాలా రుచిగా ఉంటుంది..

D by D
November 7, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Butter Naan : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌బించే ఆహార ప‌దార్థాల్లో బ‌ట‌ర్ నాన్ ఒక‌టి. దీనిని వెజ్, నాన్ వెజ్ మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటూ ఉంటాం. ఈ బ‌ట‌ర్ నాన్ ను త‌యారు చేయ‌డానికి తందూర్ అవ‌స‌ర‌మ‌వుతుంది. క‌నుక దీనిని ఇంట్లో చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. తందూర్ లేక‌పోయిన కూడా చాలా సుల‌భంగా అచ్చం రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే బ‌ట‌ర్ నాన్ మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో బ‌ట‌ర్ నాన్ ను ఏ విధంగా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌ట‌ర్ నాన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదా పిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, పెరుగు – పావు క‌ప్పు, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, క‌రిగించిన బ‌ట‌ర్ – కొద్దిగా.

Butter Naan recipe in telugu make in restaurant style
Butter Naan

బ‌ట‌ర్ నాన్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత దానిలో పెరుగు, ఉప్పు, బేకింగ్ సోడా వేసి క‌లుపుకోవాలి. త‌రువాత కొద్దిగా నీటిని పోసి చ‌పాతీ పిండి కంటే కొద్దిగా మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత నూనె వేసి మ‌రో 5 నిమిషాల పాటు బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని కావ‌ల్సిన ప‌రిమాణంలో ముద్ద‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ముద్ద‌కు కొద్దిగా పొడి పిండిని, నూనె పైన రాస్తూ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని ప్లేట్ లోకి తీసుకున్న త‌రువాత వాటిపై త‌డిపిన వ‌స్త్రాన్ని ఉంచి 30 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి. త‌రువాత ఒక్కో ముద్ద‌ను తీసుకుని పొడి చ‌ల్లుకుంటూ చేత్తో కొద్దిగా చ‌పాతీ ఆకారం వ‌చ్చేలా వత్తుకోవాలి. త‌రువాత దానిని చేత్తులోకి తీసుకుని ఒక చేతి నుండి మ‌రో చేతులోకి తీసుకుంటూ త‌డుతూ ఉంటే నాన్ సాగుతుంది. ఇప్పుడు నాన్ ఆకారం రావ‌డానికి ఒక మూల‌ను ప‌ట్టుకుని కొద్దిగా సాగ‌దీయాలి. ఇలా చేతులతో చేసుకోవ‌డం రాని వారు చ‌పాతీ క‌ర్ర‌తో కూడా చేసుకోవ‌చ్చు.

ఇలా త‌యారు చేసుకున్న నాన్ కు ఒక‌వైపు త‌డి చేసుకోవాలి. త‌డి చేయ‌డం వ‌ల్ల నాన్ పెనానికి చ‌క్క‌గా అత్తుకుంటుంది. ఇలా త‌డి చేసుకున్న వైపు కిందికి వ‌చ్చేలా జాగ్ర‌త్త‌గా వేడి పెనం పై వేయాలి. దీనిని 2 నిమిషాల పాటు చిన్న మంట‌పై కాల్చుకోవాలి. త‌రువాత మంట‌ను పెద్ద‌గా చేసి నేరుగా పెన్నాన్ని తిప్పి నాన్ ను కాల్చుకోవాలి. పెన్నాన్ని అటూ ఇటూ తిప్పుతూ నాన్ అన్ని వైపులా కాలేల చూసుకోవాలి. నాన్ కాలిన త‌రువాత జాగ్ర‌త్త‌గా పెనం నుండి వేరు చేయాలి. వేడిగా ఉన్న‌ప్పుడే నాన్ కు బ‌ట‌ర్ ను రాయాలి. ఇలా చేచ‌డం వ‌ల్ల రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే బ‌ట‌ర్ నాన్ త‌యారవుతుంది. ఈ విధంగా చేసిన బ‌ట‌ర్ నాన్ చాలా మెత్త‌గా, రుచిగా ఉంటుంది. ఈ బ‌ట‌ర్ నాన్ ను మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తందూర్ లేక‌పోయినా కూడా ఈ విధంగా సుల‌భంగా నాన్ ను త‌యారు చేసుకోవ‌చ్చు.

Tags: Butter Naan
Previous Post

Hair Growth Remedy : వీటిని క‌లిపి రాస్తే.. 15 రోజుల్లోనే ప‌లుచ‌గా ఉన్న జుట్టు మొత్తం బాగా పెరుగుతుంది..

Next Post

Annam : రాత్రి మిగిలిన అన్నాన్ని ఉద‌యం ఇలా చేస్తే.. ఎంతో పుణ్యం.. అన్నానికి లోటు ఉండ‌దు..

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.