Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Cabbage Manchuria : క్యాబేజ్ మంచూరియా.. ఇలా చేశారంటే ప్లేట్‌ మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
December 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Cabbage Manchuria : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వంట‌కాల్లో క్యాబేజి మంచురియా కూడా ఒక‌టి. దీనిని ఎక్కువ‌గా స్టాట‌ర్ గా, స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. మంచురియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ క్యాబేజి మంచురియాను మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా క్యాబేజి మంచురియాను అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రెస్టారెంట్ స్టైల్ క్యాబేజి మంచురియాను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజి మంచురియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన క్యాబేజి తురుము – 2 క‌ప్పులు, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, గ‌రం మసాలా – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Cabbage Manchuria very tasty snacks to make
Cabbage Manchuria

టాసింగ్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి త‌రుగు – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, క్యాప్సికం ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్స్, ట‌మాట సాస్ – 3 టీ స్పూన్స్, వెనిగ‌ర్ – 2 టీ స్పూన్స్, సోయా సాస్ – 2 టీ స్పూన్స్, పంచ‌దార – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, మిరియాల పొడి – పావు టీ స్పూన్, రెడ్ చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా.

క్యాబేజి మంచురియా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో క్యాబేజి తురుమును తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోయ‌కుండా అంతా క‌లిసేలా క‌లుపుకుని ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాబేజి బాల్స్ వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో టాసింగ్ కు నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క్యాప్సికం ముక్క‌లు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత సాసెస్, వెనిగ‌ర్ వేసి క‌ల‌పాలి.

త‌రువాత పంచ‌దార‌, ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ప్లేక్స్ వేసి క‌ల‌పాలి.త‌రువాత కార్న్ ఫ్లోర్ ను నీటిలో వేసి క‌లిపి వేసుకోవాలి. దీనిని చిక్క‌బడే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత వేయించిన క్యాబేజి బాల్స్ వేసి అంతా క‌లిసేలా క‌లపాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌, స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి మంచురియా త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా రెస్టారెంట్ స్టైల్ క్యాబేజి మంచురియాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Cabbage Manchuria
Previous Post

Ragi Java And Oats : ఆరోగ్యంగా ఉండ‌డం కోసం రాగి జావ‌, ఓట్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

Next Post

Chocolate Pancake : చాకొలెట్ పాన్‌కేక్‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.