Carrot Halwa : క్యారెట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని మనం వివిధ రకాలుగా తీసుకుంటూ ఉంటాము. వంటల్లో వాడడంతో పాటు క్యారెట్స్ తో తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్స్ తో చేసుకోదగిన తీపి వంటకాల్లో క్యారెట్ హల్వా కూడా ఒకటి. క్యారెట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ హల్వాను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తీపి తినాలనిపించినప్పుడు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు రుచిగా క్యారెట్ హల్వాను తయారు చేసి తీసుకోవచ్చు. రుచిగా, కమ్మగా ఉండే క్యారెట్ హల్వాను చాలా తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, క్యారెట్ తురము – 300 గ్రా., కాచి చల్లార్చిన చిక్కటి పాలు – అర కప్పు, మిల్క్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్స్, పంచదార – అర కప్పు కంటేకొద్దిగా తక్కువ లేదా తగినంత, యాలకుల పొడి – అర టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
క్యారెట్ హల్వా తయారీ విధానం..
ముందుగా పాలల్లో మిల్క్ పౌడర్ వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక క్యారెట్ తురుము వేసి వేయించాలి. క్యారెట్ తురుమును మాడిపోకుండా కలుపుతూ పూర్తిగా వేయించాలి. క్యారెట్ తురుము వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పాలను పోసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తరువాత మరికొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వాను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన క్యారెట్ హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.